Read more!

English | Telugu

ఫైమా, పటాస్ ప్రవీణ్ ల మధ్య మళ్ళీ ప్రేమ మొదలైందా?

చాలాకాలం తర్వాత కొంతమంది సెలెబ్రిటీలు కలిస్తే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనిది. అలాంటిది వారిద్దరు కలసి రీల్ చేస్తే అది ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. వారే ఫైమా, పటాస్ ప్రవీణ్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పటాస్ ప్రవీణ్,  ఫైమా జోడి ఒకటని చెప్పాలి. వీరిద్దరూ జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్లుగా పనిచేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే వీరిద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించిందని ఇద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ పలు సందర్భాలలో వీరి మధ్య ఉన్నటువంటి ప్రేమ విషయాన్ని కూడా బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు వారిద్దరు కలిసారని సోషల్ మీడియాలో వార్తలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

అసలేమైందంటే పటాస్ ప్రవీణ్ , ఫైమా కలిసి తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ రీల్ చేశారు. ఇందులో ఫైమా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రవీణ్ తన చేతితో పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు.  ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి అలా నడ్చుకుంటూ వెళ్తారు. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. "చూడ్డానికి చాలా బాగుంది. ఇలానే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి " అని ఒకరు కామెంట్ చేశారు. ఐ ఆమ్ సో హ్యాపీ   ప్రవీణ్ అన్న అండ్ ఫైమా అని మరొకరు కామెంట్ చేశారు. " మళ్ళీ మా ఫైమా అక్క ప్రేమ మొదలైంది " అని ఇంకొకరు కామెంట్ చేశారు. అయితే వీరిద్దరు కలసి ఇలా రీల్ చేయడం ఇదే ప్రథమం‌.. అయితే బయటకు మాత్రం‌ వీళ్ళిద్దరు ప్రేమికలని ఎక్కువగా వినిపిస్తుంది.  ఈ రీల్ కి ఇప్పటికే అత్యధిక వ్యూస్ రాగా ముందుముందు వీరిద్దరు స్నేహితులుగా ఉంటారా లేక ప్రేమికులుగా మరుతారేమో చూడాలి మరి.