Read more!

English | Telugu

రిషి ఫ్యాన్స్ కి మను కౌంటర్.. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్!

ఈ గుప్పెడంత మనసు సీరియల్ లో అసలేం జరుగుతుంది అంటు అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇదే సమయంలో మను పాత్రలో చేస్తున్న డాక్టర్ కమ్ యాక్టర్ రవిశంకర్ తన ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ కి వచ్చాడు. ఇందులో రిషి అభిమానులు అడిగే ప్రశ్నలకి తీవ్రంగా స్పందించాడు రవిశంకర్. ఆ వివరాలేంటో ఓసారి చూసేద్దాం...

నేను ఈరోజు లైవ్‌లోకి రావడానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే.. గుప్పెడంత మనసు సీరియల్‌పై వస్తున్న రూమర్లపై రిషి అలియాస్ ముఖేష్ గౌడ స్పందించడం. నేను ఈ సీరియల్‌లోకి వచ్చి మూడు నెలలు అవుతుంది. ఈ సీరియల్‌లో మను అనే పాత్రను చేయడాన్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ.. బాధపెట్టే విషయం ఏంటంటే.. సోషల్ మీడియాలోని కొంతమంది మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖేష్ గౌడ సీరియల్ నుంచి తప్పుకోవడం.. నేను ఎంట్రీ ఇవ్వడంతో నన్ను టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే వీటిపై ముఖేష్ గౌడ రియాక్ట్ కావడం హ్యాపీగా ఉంది. అందరూ అని చెప్పడం లేదు. చాలామంది ఫ్యాన్స్ పేజ్‌ని ముఖేష్ గౌడతో పాటు నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నారు. కొన్ని పేజ్‌లు చూసినప్పుడు చాలా దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్లు మాట్లాడుతున్నారు. పర్సనల్ లైఫ్‌ని ఎటాక్ చేస్తున్నారు. ఎదుటివాడు ఎంత బాధపడతాడని కూడా ఆలోచించడం లేదు. వాళ్లకి కామన్ సెన్స్ ఉందో లేదో తెలియడం లేదు. 

రియల్ లైఫ్‌ని రీల్ లైఫ్‌తో పోల్చి ఈజీగా తిట్టేస్తుంటారు. కొంతమంది యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు.. ఇంకొకడు బట్టల గురించి మాట్లాడతాడు.. మరొకడు బఫూన్ అంటాడు.. ఇంకేదో ఇంకేదో మాట్లాడతారు. ముఖేష్ గౌడ రెస్పాండ్ అయినప్పుడైనా మీకు అర్థం కావాలి.నన్ను ఎవరైనా ఏమైనా అన్నా.. నేనేం పట్టించుకోను. కానీ నన్ను అభిమానించేవాళ్లు హర్ట్ అవుతారు కదా.. అందుకే వాళ్లకి నేను చెప్పుకుంటూనే వచ్చాను. ఇవన్నీ మనల్ని ఆపలేవు అని. కానీ ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు. వాళ్లని టేక్ కేర్ చేయడం కూడా నా బాధ్యత. వాళ్లు బాధపడకుండా చేయాల్సిన బాధ్యత కూడా నాదే. నీకు యాక్టింగ్ ఎందుకురా?? పోయి పళ్లు పీక్కో అని కామెంట్ పెట్టాడు ఒకడు. వాడికి చెప్తున్నా.. ‘మీ అయ్య చదివించలేదు నన్ను.. నేను చదువుకున్నా.. మా అయ్య చదవించాడు. ఇదే విధంగా నేను మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది. నువ్వూ బాధపడతావ్ కదా.. మమ్మల్ని వచ్చి యాక్టింగ్ చేయమన్నారు చేస్తున్నా. పైసలు తీసుకుంటున్నాం. నీకు నచ్చితే చూడు లేదంటే.. నీకు నచ్చిన వాళ్ల కోసం చూడు. ఎవరూ నచ్చకపోతే ఎవరేం చేయలేరంటు రవిశంకర్ చెప్పుకొచ్చాడు. ఇలా ఓ సీరియల్ యాక్టర్ ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటు మరికొందరు నెటిజన్లు ఈ వీడియోకి కామెంట్లు చేస్తున్నారు.