English | Telugu

జ‌బర్ద‌స్త్‌.. నైటీతో వ‌చ్చేసిందంటూ రోజా డ్రెస్సుపై ట్రోల్స్‌!

అనారోగ్యం కారణంగా 'జబర్దస్త్' షోకి కొంతకాలం పాటు దూరమైనా రోజా.. రీసెంట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆమె షోకి వేసుకొచ్చిన డ్రెస్సుపై సోషల్ మీడియాలో నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నిజానికి చాలా మంది ఆడవాళ్లు రోజా ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుందా అని ఈ షోని చూస్తుంటారు. ఆమె వేసుకునే డ్రెస్సులు, చీరల గురించి చర్చించుకుంటారు.

అలాంటిది తాజాగా ఆమె వేసుకొని వ‌చ్చిన‌ డ్రెస్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అచ్చం నైటీలా ఉన్న లాంగ్ డ్రెస్ ను వేసుకొచ్చింది రోజా. ఆ డ్రెస్ వేసుకొని డాన్స్ స్టెప్స్ వేసింది. దీంతో నెటిజన్లు ఆమెని ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఆలస్యంగా లేవడంతో షోకి లేట్ అయిపోతుందని నైటీతో వచ్చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఆమెపై మీమ్స్ కూడా క్రియేట్ చేశారు.

"ఏదైతే అది అయిందని జెట్ స్పీడ్ లో వచ్చేసినా" అంటూ 'వకీల్ సాబ్' సినిమాలో సూపర్ విమేన్ డైలాగ్ ను రోజాకి ఆపాదిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ట్రోలింగ్ ని రోజా పెద్దగా పట్టించుకోదు. అందుకే దీనిపై కూడా స్పందించలేదు. ఇటీవలే సోషల్ మీడియాలో రోజా రీఎంట్రీ కారణంగా ఇంద్రజను వెనక్కి పంపడంతో 'రోజా మాకొద్దు' అంటూ ఇంద్రజ అభిమానులు చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.