English | Telugu

Jayam serial : గంగకి అండగా రుద్ర.. పారు ప్లాన్ నెరవేరేనా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -161 లో......మిసెస్ గంగ రుద్ర ప్రతాప్ అని మైక్ లో పిలవగానే రుద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. గంగ అకాడమీ లోనే స్టే చెయ్యాలని అక్కడ ట్రైనర్ చెప్తాడు. గంగని అకాడమీ నుండి పంపించాలని పారుతో పాటు అక్కడున్నా మేనేజ్మెంట్ అనుకుంటారు. గంగ చేత ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎక్కవ వెయిట్ లిఫ్ట్ చేపిస్తారు. వెయిట్ లిఫ్ట్ మెషిన్ కి ఉన్న స్క్రూలు లూజ్ చెయ్యాలని ఒకతన్ని పిలిపిస్తారు.

గంగపై అది పడేలా ప్లాన్ చేస్తారు. మరొకవైపు రుద్ర టీ షాప్ లో ఉంటాడు. అక్కడికి అకాడమీలో స్క్రూలు లూజ్ చేసిన అతను వస్తాడు. అకాడమీ గురించి మాట్లాడుతూ.. ఆ ట్రైనర్ మరి శాడిస్ట్ లా ఉన్నాడు. పాపం ఒక ఆవిడ ఆస్తమా అంటున్నా కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్ చేపిస్తున్నాడు అంతే కాకుండా వెయిట్ లిఫ్ట్ చేసే మెషిన్ స్క్రూలు కూడా లూజ్ చెయ్యమన్నాడని అతను చెప్పగానే రుద్ర పరుగున గంగ దగ్గరికి వెళ్తాడు‌. వెయిట్ మెషిన్ గంగ మీద పడకుండా ఆపుతాడు రుద్ర. అక్కడ వాళ్లపై రుద్ర గొడవకి దిగుతాడు. గంగ సర్దిచెప్పి రుద్రని బయటకు పంపిస్తుంది.

మరొకవైపు గంగ రుద్ర ఇంటికి రాలేదని ఇంట్లో అందరు వెయిట్ చేస్తారు. రుద్ర ఒక్కడే వస్తాడు. గంగ ట్రైనింగ్ అయ్యేవరకు అక్కడే ఉంటుందని శకుంతలకి తెలిసి కోప్పడుతుంది. గంగ అక్కడ ఉంటే కోడలిగా అవసరం లేదని తన నిర్ణయాన్ని చెప్తుంది శకుంతల. తరువాయి భాగంలో గంగను అకాడమీ నుండి పంపించడానికి పారు ప్లాన్ చేస్తుంది. గంగ తాగిన జ్యూస్ లో ఏదో కలుపుతుంది. అది తాగి గంగ మత్తులో డ్యాన్స్ చేస్తుంది. అది వీడియో తీసి అక్కడ ఒకతనికి పంపిస్తుంది పారు. వెంటనే మేడమ్ ని తీసుకొని గంగ దగ్గరికిరా గంగని ఈ సిచువేషన్ లో చూసిందంటే అకాడమీ నుండి పంపిస్తుందని అతనికి పారు చెప్తుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.