English | Telugu

నీ కూతురును ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువ‌గా న‌న్ను ప్రేమించు ప్లీజ్.. హరితేజ ఎమోషనల్ పోస్ట్!

నటి హరితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. మొదట్లో బుల్లితెరపై సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ చేసి ప్రేక్షకులను బయపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత బిగ్ బాస్ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించారు. బిగ్ బాస్ షో వలన హరితేజ మలుపు తీసుకుంది. ఆమెకి మరిన్ని అవకాశాలు వచ్చాయి. పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో కూడా నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పనక్కర్లేదు.

ఎప్పటికప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ పాపులారిటీ పెంచుకుంటోంది హ‌రితేజ‌. కొన్నాళ్ల క్రితమే హరితేజకు పండంటి బిడ్డ పుట్టింది. డెలీవరి సమయంలో తను చాలా ఇబ్బందులు పడ్డానని.. కరోనా పాజిటివ్ రావడంతో మొదట ఏ హాస్పిటల్ లో జాయిన్ చేసుకోలేదని వాపోయింది. ఫైనల్ గా ఓ హాస్పిటల్ వారు అంగీకరించి తనకు డెలివెరీ చేశారని చెప్పుకొచ్చింది. అయితే ఆ సమయంలో తన భర్త మాత్రమే తనకు తోడుగా ఉన్నాడని హరితేజ కొన్నిరోజుల క్రితం వెల్లడించింది.

తాజాగా తన భర్త దీప‌క్ రావు గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ గా రాసుకొచ్చింది హరితేజ. త‌న‌కు కూతురు పుట్టిన రోజు భర్త తీసుకున్న కేర్ ని ఓ వీడియో రూపంలో షేర్ చేసింది హరితేజ. ''నువ్ నన్నొక చిన్న పిల్లలా చూసుకున్నావ్.. నాకు కావాల్సినంత ధైర్యాన్ని ఇచ్చావ్. నువ్ లేకుండా ఏదీ సాధ్యం కాదు. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా'' అంటూ తన భర్త దీపుని ఉద్దేశిస్తూ రాసుకొచ్చింది. అంతే కాదు, "నీ కూతురును నువ్వు ప్రేమిస్తున్న దానికంటే ఎక్కువ‌గా న‌న్ను ప్రేమించు ప్లీజ్" అంటూ చివ‌రలో గ‌మ‌నిక‌గా రాసింది.

ఆమె షేర్ చేసిన వీడియోలో ఆ రోజు ఉద‌యం ఆమెకు భ‌ర్త దీపు త‌ల‌దువ్వ‌డం ద‌గ్గ‌ర్నుంచి హాస్పిట‌ల్‌లో డెలివ‌రీకి వెళ్లే స‌మ‌యం దాకా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.