English | Telugu

పూర్ణ ఇల్లు ఎంత పాష్‌గా ఉందో చూశారా?

తెలుగులో 'శ్రీ మహాలక్ష్మి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. ఆ తరువాత 'సీమ టపాకాయ్', 'అవును' వంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా ఓకే అనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం టీవీ షోలలో న్యాయ నిర్ణేతగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్స్ యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టి పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. పూర్ణ కూడా కొంతకాలం క్రితం సొంతంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసింది. తాజాగా తన హోమ్ టూర్ వీడియోను పోస్ట్ చేసింది.

చుట్టూ చెట్లు.. మధ్యలో ఉన్న తన ఇంటిని అభిమానులకు చూపించింది. ముందుగా తను పెంచుకుంటున్న పక్షులను, తన దగ్గరున్న మూడు కార్లను చూపించింది. 2009లో తను సంపాదించిన డబ్బుతో ఇన్నోవా కారు కొనుక్కున్నానని.. ఆ కార్ అంటే తనకు సెంటిమెంట్ అని చెప్పింది. అందుకే ఇన్నేళ్లు అవుతున్నా మార్చలేదని తెలిపింది. అలానే హ్యుంద‌య్ కంపెనీకి చెందిన ఓ కారు ఉన్నట్లు చూపించింది. తనకు డ్రైవింగ్ పెద్దగా రాకపోయినా ఆ కారు మీద ట్రయల్స్ వేస్తానని చెప్పింది.

పాష్ గా ఉండాలని ఆడి కారు తీసుకున్నానని.. కానీ పెద్దగా వాడనని చెప్పింది. అనంతరం తన ఇంట్లో ఉన్న హాలుని చూపిస్తూ.. అక్కడ ఉన్న వస్తువుల గురించి చెప్పుకొచ్చింది. ఇంట్లో ఎక్కువ సమయం కిచెన్ లో, అలానే తన బెడ్ రూమ్ లో గడుపుతానని చెప్పింది. తనకు వంట పెద్దగా రాదని.. కానీ క్లీనింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇంట్లో ఉన్న ఫోటోలను చూపిస్తూ.. స్టోరీలను చెప్పుకొచ్చింది. ఆ తరువాత తను డాన్స్ ప్రాక్టీస్ చేసే ప్లేస్ ని చూపించింది. అనంతరం తన బెడ్ రూమ్ ని చూపిస్తూ అదే తన హెవెన్ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తరువాత తన ఆల్బమ్ ని చూపిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.