Read more!

English | Telugu

వాళ్ళ నాన్నని చంపిందెవరో కృష్ణకి తెలిసిపోయిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -148 లో.. కృష్ణ తన గదిలోని వాచ్ సరిగా పనిచేయకపోవడం చూస్తుంది. ఆ తర్వాత కృష్ణ చైర్ ఎక్కి వాచ్ ని తీస్తుండగా.. స్లిప్ అయి పడిపోతుంటే.. మురారి వచ్చి పట్టుకుంటాడు. నువ్వు చేస్తుందేంటి కృష్ణా.. చూసుకోవాలి కదా అని అంటాడు. అంటే సర్ అది వాచ్ పని చెయ్యడం లేదు.. టైం ఎప్పుడు కరెక్ట్ గా నడుస్తూ ఉండాలి కదా అని తీసానని చెప్తుంది. మీ ఫోన్ లో చూసి టైం ఎంత అవుతుందో చెప్పండని.. టైం తెలుసుకొని  సెట్ చేస్తుంది.

మరొకవైపు కృష్ణ కావాలని నందు మారం చేస్తుంది. నేను వెళ్తాను.. కృష్ణ,మురారి, రేవతి పిన్నిని చూడాలి.. వాళ్ళు చాలా మంచి వాళ్ళని నందు అంటుంది. వాళ్ళందరూ ఉంటారు.. కరెక్ట్ కాని అక్కడే మీ అమ్మ బాబాయ్ లు కూడా ఉంటారని గౌతమ్ అంటాడు. మనం అక్కడికి వెళ్ళకూడదు కానీ వాళ్ళు ఇక్కడికి రావొచ్చు కదా అని నందు అడుగుతుంది. అవును రావొచ్చు.. నేను ఫోన్ చేసి కృష్ణని రమ్మని చెప్తాను సరే నా నందు అని గౌతమ్ చెప్తాడు. ఆ తర్వాత మురారి స్టేషన్ కి వెళ్తుంటే.. కృష్ణ పెద్ద లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది. ఏంటి కృష్ణ ఇది.. మా స్టేషన్ మొత్తానికి లంచ్ నువ్వే రెడీ చేసావా అని అడుగుతాడు. లేదు ఏసీపీ సర్ మీకోసమని ఇన్ని వంటలు చేశానని కృష్ణ అంటుంది. పని చేయడం కోసం తినాలి.. తినడమే పనిగా పెట్టుకోవద్దని మురారి అంటాడు. మనకు ఇంట్లో ఫుడ్ లేకుండా చేసిన వాళ్ళ మొహం మీద కొట్టినట్లు.. మీరు ఇది తీసుకెళ్ళాలని కృష్ణ అంటుంది. మరి నీ బాక్స్ ఎక్కడ అని అనగానే.. కృష్ణ తను తీసుకెళ్తున్న చిన్న బాక్స్ ని చూపిస్తుంది.

నీకేమో చిన్న బాక్స్.. నాకేమో ఇంత పెద్దదా అని మురారి అంటాడు. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరు బయల్దేరి వెళ్తారు. కృష్ణ హాస్పిటల్ కి వెళ్తుంది.. అక్కడ అనుకోకుండా కృష్ణ వాళ్ళ ఊరిలోని అంజి బాబాయ్  కనిపిస్తాడు. అతడిని చూసిన కృష్ణ.. ఇక్కడ ఏంటి బాబాయ్ అని అడుగుతుంది. నా కొడుకుకి బాగోలేదని చెప్పి బాధపడతాడు. వెంటనే కృష్ణ  వేరే డాక్టర్ తో  ఆ బాబు గురించి మాట్లాడుతుంది. ఆ డాక్టర్ అతనికి ఆపరేషన్ చెయ్యాలని చెప్తాడు. మీరేం బాధపడకండి బాబాయ్.. ఆపరేషన్ చేసాక మళ్ళీ మాములు అయిపోతాడని టాబ్లెట్స్ ఇస్తుంది కృష్ణ. నువ్వు మీ అమ్మనాన్నలకు ఇచ్చిన మాటని నెరవేర్చావ్.‌. డాక్టర్ కావాలనే నీ కల నెరవేర్చుకున్నావ్.. మీ నాన్నలాగా వేరే వాళ్ళ కష్టాన్ని, నీ కష్టంగా చూస్తావ్.. మీ నాన్న ఉండి ఉంటే ఎంత సంతోషపడేవారో అని కృష్ణతో అంజి బాబాయ్ అంటాడు. అవును ఏసీపీ సర్ ఎలా ఉన్నాడని అతడు అడుగుతాడు.

సర్ కి ఏంటీ.. బాగున్నాడు. ఒక మా నాన్న చావుకి కారణం అయ్యాడన్న ఆ ఒక్క తప్పు తప్పా, ఎంత వెతికిన సర్ లో ఏ లోపాలు కనిపించవు.. నన్ను బాగా చూసుకుంటారని కృష్ణ అంటుంది. ఏంటమ్మా.. నువ్వు అనేది. మీ నాన్న చావుకి ఏసీపీ సర్ కారణం ఏంటి.. నువ్వు సర్ ని తప్పుగా అనుకుంటున్నావు. ఆ రోజు ఎలాగైనా శివన్నని అరెస్ట్ చెయ్యాలని.. మీ నాన్న, ఏసీపీ సర్ ఏదో కోడ్ బాషలో మాట్లాడుకున్నారు. మీ నాన్న షూట్ చెయ్ అంటేనే ఏసీపీ సర్ వద్దు వద్దు అన్నాడు. అయినా వినకుండా ఒట్టేసుకోని మరి ఏసీపీ సర్ ని షూట్ చెయ్యమన్నాడు. అందులో ఏసీపీ సర్ తప్పేం లేదమ్మా.. మీ నాన్న ఎలాగైనా శివన్నని అరెస్ట్ చేయించి రిటైర్ అవుదామని అనుకున్నాడు.. ఏసీపీ సర్ తప్పేం లేదని కృష్ణకి అంజి చెప్పడంతో.. తను షాక్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. 
కృష్ణ పశ్చాత్తాపంతో గుడికి వెళ్తుంది. అక్కడ మోకాళ్ళపై గుడి మెట్లు ఎక్కుతున్న కృష్ణని చూసిన పంతులు.. మురారికి ఫోన్ చేసి చెప్తాడు. వెంటనే మురారి ఆ గుడికి వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.