Read more!

English | Telugu

బ్రహ్మముడి ‌కలిపింది ఆ ఇద్దరిని.. ఇందిరాదేవి పూజ ఫలించినట్టేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -87 లో.. రాజ్, కావ్యలు ఒకే గదిలో నిద్రపోతుండగా..  రాజ్ బెడ్ మీద నుండి దొర్లుతూ కావ్యపై పడతాడు. అలా రాజ్ పడడంతో కావ్య భయపడుతూ.. నన్నేం చెయ్యొద్దంటూ గట్టిగా అరుస్తుంది. మీరు డీసెంట్ అనుకున్నాను.. మీరు ఒక విలన్ అని అంటూ అరుస్తూ డోర్ దగ్గరికి వెళ్తుంది. నేను విలన్ అయితే నువ్వు హీరోయిన్ వా అని రాజ్ అంటాడు. కావ్య అరుపులు విని ఇందిరాదేవి, కళ్యాణ్, రాజ్ బాబాయ్ వస్తారు. ఏమైందని అడుగుతుంది రుద్రాణి. అమ్మమ్మ గారు అంటూ ఇందిరాదేవి మీద పడి ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తుంది కావ్య. ఏం చెప్పను అమ్మమ్మ.. బోరున ఏడువాలని ఉందని కావ్య అంటుంది. ఏం అన్నావ్ రా.. మొరటోడా.. నా మనవరాలిని అలా బయపెడతవా.. అయినా నువ్వు నచ్చ చెప్పుకోవాలి కానీ అలా బయపెడతారా అని ఇందిరాదేవి కావ్యను అంటుంది.

పువ్వునైనా లవ్వైనా సున్నితంగా డీల్ చేయాలని కళ్యాణ్ అంటాడు. అందరికి నిద్ర వస్తున్నట్లు ఉంది వెళ్ళండి అని రాజ్ అనగానే.. మళ్ళీ ఏదైనా చేస్తే ఫోన్ చెయ్యమ్మా వచ్చి వాడి సంగతి చెప్తా అని ఇందిరాదేవి అంటుంది. అందరు వెళ్ళిపోయాక.‌. రాజ్ వెళ్తుండగా కావ్య లాగేస్తుంది.. దాంతో కావ్యపై వచ్చి రాజ్ పడతాడు. ఇందాక నేను కూడా అలానే పడిపోయా.. ఆ మాత్రం దానికి అంత చెయ్యాలా అని రాజ్ అంటాడు.

మరొకవైపు స్వప్న ఉదయం లేచి.. పెద్దమ్మ కాఫీ తీసుకొని రా అంటుంది.. కాఫీ వద్దు గోరు వెచ్చటి నీళ్లు తాగమని వాళ్ళ పెద్దమ్మ అనగానే.. కాఫీ తెమ్మని చెప్పను కదా.. ఇంకా తీసుకురావట్లేదేంటని వాళ్ళ పెద్దమ్మ పై స్వప్న అరుస్తుంటే.. కనకం కిచెన్ లోంచి వస్తుంది. నువ్వేమైనా మహారాణివా.. నువ్వు లేచేసరికి నీకు కాఫీ తీసుకురావాడానికని కనకం అంటుంది. అదేంటీ ఇంట్లో పడి తేరగా తింటుంది కదా.. ఎవరు లేరని ఇంట్లో ఉంచి మేపుతున్నారు కదా అని వాళ్ళ పెద్దమ్మని స్వప్న  అంటుంది. అప్పుడే కృష్ణమూర్తి వచ్చి..  నోర్ ముయవే ఫస్ట్.. ఆమె ఈ ఇంటి పెద్ద దిక్కు పరాయిది కాదు.. నువ్వు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు కృష్ణమూర్తి. నా అక్కని ఏమైనా అంటే ఇంట్లో నుండి గేంటేస్తా అని కనకం అంటుంది. అలా అనగానే ఆవిడా కోసం కన్నకూతురుని తిడతారా అంటూ స్వప్న లోపలికి వెళ్ళిపోతుంది. నాకోసం స్వప్న ని ఎందుకు అలా అంటున్నారని వాళ్ళ పెద్దమ్మ బాధపడుతుంది. నేను ఉన్నా కదా అని అప్పు అంటుంది. నాకు అమ్మవి.. నువ్వే పెద్దమ్మ అంటూ అప్పు ప్రేమగా మాట్లాడుతుంది.

మరొకవైపు బ్రహ్మముడి విప్పి  రాజ్, కావ్యలకు స్నానాలు చేపిస్తారు. బ్రహ్మముడి విప్పగానే విడివిడిగా ఉండమని కాదు కలుసుండమని అర్థమని రాజ్ కి చెప్తుంది. కాసేపటికి కావ్య చేత పూజ చేపిస్తుంది ఇందిరాదేవి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.