Read more!

English | Telugu

‘దసరా’ వెన్నెల కాస్ట్యూమ్ లో బ్రహ్మముడి సీరియల్ కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ లో రాజ్, కావ్యల జోడీ కోసం చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. అంతలా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జోడీకి ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ బేస్ చాలానే ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో బ్రహ్మముడి ఫ్యాన్, రాజ్ కావ్య ఫ్యాన్ పేజ్, కావ్య ఫ్యాన్ బాయ్, కావ్య ఫ్యాన్ గర్ల్ అంటు చాలా అకౌంట్సే ఉన్నాయి‌. బ్రహ్మముడి సీరియల్ ప్రోమో రిలీజ్ అయిన అరగంటకే వేలల్లో వ్యూస్ వస్తున్నాయంటే ఈ సీరియల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

బ్రహ్మముడి సీరియల్ లో కథ ప్రతీ మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగా ఉండటంతో బాగా పాపలర్ అవుతోంది. అయితే కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని  సామాన్య మధ్యతరగతి వాళ్ళుగా, దుగ్గిరాల కుటుంబాన్ని ధనవంతులుగా చూపించిన తీరు బాగుంది. కనకం వాళ్ళ ఇంటి నుండి వెళ్ళిన కావ్య.. దుగ్గిరాల కుటుంబంలో తన ఆత్మగౌరవం కోసం పోరాడుతుంది. అయితే తన కష్టాలన్నీ తొలగిపోవాలని ఈ సీరియల్ చూసే ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే కావ్యకి భర్తగా రాజ్ అలియాస్ మానస్ చేస్తున్నాడు. దీంతో ఈ సీరియల్ కి మరింత హైప్ వచ్చింది.

అయితే కావ్య అలియాస్ దీపిక రంగరాజు.. ఇప్పుడు ప్రతీ ఇంట్లో ఒక ఆడపడుచులా మారింది. ఒకప్పుడు వంటలక్కకి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు 'బ్రహ్మముడి' కావ్యగా అంత పేరుతెచ్చుకుంది దీపిక. తమిళనాడులో పుట్టిన దీపిక ఈ సీరియల్ కోసం తెలుగు నేర్చుకుంటోంది. బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రతీ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసే కావ్య అలియాస్ దీపిక.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. అదేంటంటే రీసెంట్ గా తనొక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో లేటెస్ట్ గా ఒక వీడియోని అప్లోడ్ చేసిందిమ చెన్నై టూ హైద్రాబాద్ అంటూ ఆ వీడియోకి టైటిల్ ఇచ్చింది దీపిక. ఇందులో తను ఆదివారం జరగబోయే 'స్టార్ మా పరివారం' షోకి వస్తున్నట్టుగా చెప్పింది. అందులో తనొక గెటప్ వేస్తున్నట్టు చెప్పింది. మేకర్స్ తనకి 'దసరా' సినిమాలో 'కీర్తి సురేష్' వేసిన పల్లెటూరి అమ్మాయిగా తన గెటప్ ని ఫోటో పంపించి అలా కాస్ట్యూమ్ వేసుకొని రమ్మన్నారంట.. దాంతో తను అలా రెడీ అవ్వడానికి ఎంతగా శ్రమించాల్సి వచ్చిందో ఆ వీడియోలో చెప్పుకొచ్చింది దీపిక. అయితే ఇప్పుడు యూట్యూబ్ లో దీపిక అప్లోడ్ చేసిన ఈ వీడియోకి మంచి స్పందన లభిస్తుంది.