English | Telugu

కెవ్వు కార్తీక్‌ రెమ్యునరేషన్ మామూలుగా లేదుగా!!

బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్'కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ షో చాలా మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇందులో కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతున్నారు. ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో కెవ్వు కార్తీక్ ఒకడు. టీమ్ మెంబర్ గా ఎంట్రీ ఇచ్చిన కెవ్వు కార్తీక్ టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు.

రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన కార్తీక్.. ఆ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. అవినాష్ తో కలిసి స్కిట్ లు చేసిన కెవ్వు కార్తీక్ కు స్క్రిప్ట్ రాసే టాలెంట్ కూడా ఉండడంతో అతడికి త్వరగానే మంచి గుర్తింపు లభించింది. తాను మొదట్లో 200 రూపాయలకు మిమిక్రీ చేసేవాడినని, ఇంజనీరింగ్ చదివిన తరువాత ఈవెంట్లు చేయడం మొదలుపెట్టాన‌ని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

వరంగల్ లో చేసిన ఓ ఈవెంట్ వలన తనకు క్రేజ్ పెరిగి అవకాశాలు రావడం మొదలయ్యాయని.. అలానే 'జబర్దస్త్' షోలో ఛాన్స్ వచ్చిందని తెలిపాడు. టీమ్ లీడర్ స్థాయికి చేరుకున్న తరువాత తన రెమ్యునరేషన్ లక్షల్లోకి చేరిందని చెప్పుకొచ్చాడు. అయితే ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే విషయం మాత్రం చెప్పలేదు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం.. కార్తీక్ రెమ్యునరేషన్ ఒక ఎపిసోడ్‌కు రూ.2 లక్షలకు అటు ఇటుగా ఉంటుందని టాక్.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.