English | Telugu

భార్య ఆరోగ్యంపై బిగ్ బాస్ కౌశల్ ఎమోష‌న‌ల్‌ పోస్ట్.. ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. రెండో సీజన్ విన్నర్ గా కంటే పలు కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచేవాడు. పీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని, గిన్నిస్ రికార్డ్ కోసం అడిగారని ఇలా గొప్పలు చెప్పుకోవడంతో అతడి ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. ఇది కాకుండా.. కౌశల్ ఆర్మీలో కొందరు సభ్యులు అతడికి వ్యతిరేకంగా మారడంతో వ్యవహారం బాగా ముదిరిపోయింది.

కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ డబ్బులు వృధా చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. చెప్పినట్లుగా కౌశల్ డబ్బులను ఫౌండేషన్ కు ఇవ్వలేదని అన్నారు. ఇలాంటి వార్తలతో అతడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యేవాడు. కౌశల్ తో పాటు అతడి భార్య నీలిమపై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. మొన్నామధ్య నీలిమ ఆరోగ్యం గురించి కౌశల్ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తన భార్యకు ఆరోగ్యం బాలేదని మీడియా ముందు చెప్పాడు కౌశల్.

నీలిమకు గతంలో ఓ సర్జరీ కూడా జరిగింది. అయితే తాజాగా కౌశల్ తన భార్యను ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ''ఏదో సాధించేందుకు వెళ్లావ్.. దాని కోసం నువ్ నీ జీవితంతో పోరాడుతున్నావ్.. నీకున్న ధైర్యంతో నువ్ అనుకున్నది సాధిస్తావ్ అని నాకు తెలుసు.. త్వరగా కోలుకొని రా.. నువ్ కన్న కలల కోసం పోరాడు.. లవ్యూ.. మిస్ యూ'' అంటూ కౌశల్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూసిన కౌశల్ అభిమానులు.. వదినకు ఏమైందంటూ కౌశల్ ని ప్రశ్నిస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.