English | Telugu

రోజా మాకొద్దంటున్న నెటిజన్లు!

'జబర్దస్త్' షో బుల్లితెరపై నెంబర్ వన్ కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ షోని విమర్శించే వారు ఉన్నప్పటికీ.. టాప్ టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. ఈ షోకి పోటీగా ఎన్ని షోలు వచ్చినప్పటికీ నిలవలేకపోతున్నాయి. ఇదిలా ఉండగా.. జడ్జి ప్లేస్ లో పర్మనెంట్‌గా కూర్చున్న రోజా.. ఇటీవల అనారోగ్య కారణాల వలన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె స్థానంలోకి సీనియర్ హీరోయిన్ ఇంద్రజ వచ్చి చేరింది.

త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న‌ ఇంద్రజ జడ్జి రోల్‌కి పూర్తి న్యాయం చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా చిన్న చిన్న పంచ్ లతో మనో, ఇంద్రజ కాంబినేషన్ ఆకట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో మళ్లీ జడ్జి ప్లేస్ లోకి రోజా వచ్చి చేరింది. కొన్నిరోజుల క్రితం దీనికి సంబంధించిన ప్రోమోను వదిలారు. ప్రోమో ఎంటర్టైనింగ్ గానే ఉన్నప్పటికీ.. నెటిజన్లు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

చాలా మంది నెటిజన్లు రోజాను ఉద్దేశిస్తూ.. రోజా మాకొద్దు బాబోయ్.. ఇంద్రజనే కావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోజా కాస్త ఓవరాక్షన్ చేస్తుందని.. కానీ ఇంద్రజ అలా కాకుండా చాలా జెన్యూన్ గా రెస్పాండ్ అవుతుందంటూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. కానీ 'జబర్దస్త్' షో నుండి రోజాని తప్పించే ఛాన్స్ లేదు. కాబట్టి ఈ కామెంట్స్ ను చూసి చూడనట్లుగా ఉంటూ రోజానే కంటిన్యూ చేస్తారు నిర్వాహ‌కులు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.