English | Telugu

శౌర్య.. 'సారంగ ద‌రియా' డాన్స్ వీడియో వైరల్!

'కార్తీక దీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ సీరియల్ కనిపించే ప్రతీ క్యారెక్టర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. డాక్టర్ బాబుగా నటిస్తోన్న నిరుపమ్, దీపగా నటిస్తోన్న ప్రేమి విశ్వనాథ్ లకు పాపులారిటీ బాగా పెరిగిపోయింది. శౌర్య, హిమ, సౌందర్య, మోనిత ఇలా అన్ని పాత్రలకు మంచి గుర్తింపు లభించింది. అలా 'కార్తీక దీపం' శౌర్యకి క్రేజ్ ఏర్పడింది. అభిమానులంతా ఆమెని రౌడీ అని పిలుస్తుంటారు. శౌర్య అస‌లు పేరు కృతిక‌.

చిన్నప్పటినుండి ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి అభిమానాన్ని సంపాదించుకుంటోంది శౌర్య (కృతిక). వెండితెరపై కొన్ని సినిమాల్లో కూడా నటించింది. తాజాగా ఆమె 'సారంగ దరియా' పాటకు స్టెప్పులు వేసింది. 'లవ్ స్టోరీ' సినిమాలోని 'సారంగ దరియా' పాటకు సాయి పల్లవి వేసిన స్టెప్పులు తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే.

అయితే ఇప్పుడు శౌర్య అచ్చం సాయి పల్లవిలా డాన్స్ చేయడానికి ప్రయత్నించింది. ఈ డాన్స్ చూసిన నెటిజన్లు ఆమెని ప్రశంసిస్తున్నారు. "చాలా బాగా చేశావ్.. దిష్టి తీయించుకో" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన శౌర్య.. ఈ ఏడాదిలో వచ్చిన ఎనర్జటిక్ సాంగ్ ఇదేనని అంటూ.. ఇంతమంచి పాట ఇచ్చినందుకు 'లవ్ స్టోరీ' టీమ్ కు స్పెషల్ గా థాంక్స్ చెప్పింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.