English | Telugu

ఇంకెప్పుడు మ‌ళ్లీ మ‌నం ఫ్రీ అవుతాం?.. బికినీ ఫొటోతో బిగ్ బాస్ బ్యూటీ ప్ర‌శ్న‌!

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోకి రాకముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన తేజస్వికి హీరోయిన్ గా మాత్రం అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ షోతో ఆమె ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అయితే బిగ్ బాస్ షోతో ఎంత క్రేజ్ వచ్చిందో.. అంతే నెగెటివిటీను కూడా మూటగట్టుకుంది. మొత్తానికి ఈ షోతో తేజస్వికి మంచి చెడు రెండూ జరిగాయి.

ఈ షో తరువాత అమ్మడుకు 'లాఫ్టర్ చాలెంజ్' అంటూ బ్రహ్మానందంతో కలిసి ఓ షో చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఈ షోకి సరైన టీఆర్పీ రాక మధ్యలోనే ఆపేశారు. ఆ తరువాత 'కమిట్మెంట్' అనే సినిమాలో నటించింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. తన నిజజీవితంలో ఎదుర్కొన్న ఘటనలే ఈ సినిమాలో ఉన్నాయంటూ పబ్లిక్ గా చెప్పింది తేజస్వి. ఇలా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసే ఈ బ్యూటీ కాసేపటి క్రితం బికినీ ధరించి ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది. 'ఇంకెప్పుడు మ‌ళ్లీ మనం ఫ్రీ అవుతాం' అంటూ పాండమిక్ పరిస్థితిని ఉద్దేశిస్తూ క్యాప్షన్ ఇచ్చింది. క్యాప్షన్ సంగతేమో కానీ ఈ ఫొటోలో తేజస్వి హాట్నెస్ కి యూత్ ఫిదా అయిపోయింది. బీచ్ ఒడ్డున ఆమె తీసుకున్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.