English | Telugu

కార్తీక్‌ చేతికి ప్రూఫ్స్‌.. దీప లైన్ క్లియ‌ర్‌!

'కార్తీక దీపం' సీరియ‌ల్ ఈ శ‌నివారం స‌రికొత్త మ‌లుపు తిర‌గ‌బోతోంది. శౌర్య‌తో క‌లిసి వంట‌గ‌దిలో కింద కూర్చుని కార్తీక్ అన్నం తిన‌డం చూసిన సౌంద‌ర్య‌, ఆనంద‌రావు ఫ్యామిలీ ఒక్క‌సారిగా అవాక్క‌వుతారు. ఎంత‌లో ఎంత మార్పు అనుకుంటారు. కార్తీక్ తింటూ ఇంట్లో వాళ్ల‌పై సెటైర్లు వేస్తున్న తీరుకు ఆశ్చ‌ర్య‌పోయిన ఇంటివారు ఆ తంతుని సైలెంట్‌గా చూస్తుండిపోతారు.

క‌ట్ చేస్తే కార్తీక్‌ని అన‌వ‌స‌రంగా మాట‌ల‌న్నాన‌ని మోనిత ఫీల‌వుతూ వుంటుంది. ఎలాగైనా అత‌‌న‌ని త‌న ద‌గ్గ‌రికి తెచ్చుకోవాల‌ని, ఆలోచిస్తూ వుంటుంది. "నేను చెప్పిందంతా కార్తీక్ విని సైలెంట్‌గా వెళ్లాడంటే నేను చెప్పింది క‌రెక్టే అని ఆలోచిస్తున్నాడ‌నే క‌దా అర్థం. సో త‌ను న‌న్ను అపార్థం చేసుకునే అవ‌కాశం లేన‌ట్టే. కాక‌పోతే కార్తీక్ త‌న ద‌గ్గ‌ర శౌర్య వుంద‌ని చెప్పాడు. దానివ‌న్నీ దీప బుద్దులే.. సందు చూసుకుని కార్తీక్ మ‌న‌సుని మార్చి త‌న‌తో పాటు దీప ద‌గ్గ‌రికి తీసుకెళ్లినా తీసుకెళుతుంది. అంత చావు తెలివితేట‌లున్నాయి దానికి. వీలైనంత త్వ‌ర‌గా శౌర్య‌ని పంపించేయాలి." అని మోనిత త‌న‌లో తానే మాట్లాడుకుంటుంది.

క‌ట్ చేస్తే కార్తీక్ కోర్టు విష‌యం గురించి మాట్లాడుతుంటాడు. "కోర్టు ఇద్ద‌రినీ ఇస్తానంటే ఇద్ద‌రినీ తీసుకుందాం" అంటాడు. "వాళ్లిద్ద‌రినీ తీసుకుంటే నేనేందుకు?" అంటూ పి‌చ్చిపట్టిన దానిలా న‌వ్వుతుంది మోనిత‌.. ఇంకోవైపు.. "ఏంటే ఇది.. కోర్టు నోటీసు చ‌‌దివావా?.. ఇంత నిబ్బ‌రంగా వున్నావేంటే?" అంటుంది సౌంద‌ర్య దీప‌ని. "నిబ్బ‌రంగా ఎందుకు లేను శుబ్బ‌రంగా ఇద్ద‌రం కోర్టుకు వెళ‌దాం" అంటుంది దీప‌. "జ‌రిగేవ‌న్నీ చూస్తూ పిచ్చిప‌ట్టి మాట్లాడుతున్నావే" అంటుంది సౌంద‌ర్య‌.. ఇదే స‌మ‌యంలో కార్తీక్ చేతికి అస‌లు ప్రూఫ్స్ వ‌చ్చి చేర‌తాయి.. దీంతో దీప లైన్ క్లియ‌ర్ అవుతుంది.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో పూర్తిగా చూడాలంటే స్టార్ మాలో 'కార్తీక దీపం' చూడాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.