English | Telugu

ముమైత్‌కు వ‌చ్చిన లెట‌ర్‌.. అర‌బిక్‌లో చ‌దివిన అవినాష్‌‌!

బుల్లితెర‌పై మ‌ళ్లీ ఓంకార్ హంగామా మొద‌లైంది. గ‌తంలో 'డ్యాన్ బేబీ డ్యాన్స్' అంటూ డ్యాన్స్ జూనియ‌ర్స్‌.. డ్రామా జూనియ‌ర్స్ .. సిక్స్త్ సెన్స్, ఇస్మార్ట్ జోడీ, వంటి విభిన్న‌మైన షోల‌తో పాపుల‌ర్ అయిన ఓంకార్ మ‌ళ్లీ త‌న స‌త్తాని స్టార్ మాలో చాటుకుంటున్నారు. కొత్త‌గా డ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ 'డ్యాన్స్ ప్ల‌స్' అంటూ స‌రికొత్త డ్యాన్స్ షోని మొద‌లుపెట్టారు.

ఈ షో విజ‌య‌వంతంగా దూసుకుపోతోంది. యానీ మాస్ట‌ర్‌, ర‌ఘు మాస్ట‌ర్‌, బాబా భాస్క‌ర్‌, ముమైత్ ‌ఖాన్‌, మోనాల్ గ‌జ్జ‌ర్‌, య‌ష్ మాస్ట‌ర్ ఈ షోకి జ‌డ్జెస్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా ఓంకార్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. గ‌త కొన్ని వారాలుగా ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ఈ షో శ‌నివారం, ఆదివారాలు ప్ర‌సారం అవుతోంది. ఈ శ‌నివారం షోలో ముక్కు అవినాష్ పోస్ట్‌మ్యాన్‌గా వ‌చ్చి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

ల‌క్ష‌లు ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి షో చేస్తూ బాబా భాస్క‌ర్‌కి ఒక్క ప్యాంట్ కూడా కొనివ్వ‌లేదు, అందుకే లుంగీ క‌ట్టుకొని షోకు వ‌స్తున్నారు .. అంటూ అవినాష్ న‌వ్వులు పూయించాడు. ఇక అర‌బ్ కంట్రీ నుంచి ముమైత్‌ఖాన్‌కి లెట‌ర్ వ‌చ్చిందంటూ అర‌బిక్ భాష‌లో ఆ లెట‌ర్‌ను అవినాష్ చ‌దివిన తీరు అంద‌ర్నీ తెగ న‌వ్వించింది. ముమైత్ అయితే ప‌డీ ప‌డీ న‌వ్వేసింది. అలా త‌న పోస్ట్‌మ్యాన్ క్యారెక్ట‌ర్‌తో న‌వ్వులు విరబూయించాడు. అత‌డి కామెడీని ముమైత్ బాగా ఎంజాయ్ చేసింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.