English | Telugu

'కార్తీకదీపం' చిన్నారులు శౌర్య‌, హిమ నెల సంపాద‌న ఇంతా?!

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని సీరియల్స్ పోటీ పడుతున్నా.. 'కార్తీకదీపం'ను బీట్ చేయలేకపోతున్నారు. అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ తో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగా సీరియల్స్ అంటే ఎక్కువగా గృహిణులు మాత్రమే చూస్తుంటారనే అపోహ ఉండేది కానీ ఈ సీరియల్ ను పురుషులు స‌హా అన్ని వర్గాల ప్రేక్షకులు చూసేస్తున్నారు.

ఇక ఈ సీరియల్ లో నటించే వారందరికీ పాపులారిటీ పెరిగింది. డాక్టర్ గా బాబుగా చేస్తున్న నిరుపమ్ కి, వంటలక్కగా నటిస్తోన్న ప్రేమి విశ్వనాథ్ లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక వీరి పిల్లలుగా నటిస్తోన్న హిమ (సహృద), శౌర్య (కృతిక)లకు కూడా సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అయితే ఈ సీరియల్ కు సంబంధించి ఈ పిల్లలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే చర్చ చాలా కాలంగా నడుస్తోంది. సాధారణంగా లీడ్ యాక్టర్స్ కు ఎపిసోడ్ లెక్కన రెమ్యునరేషన్ ఇస్తుంటారు.

సైడ్ క్యారెక్టర్ లకు, అలానే చిన్న పిల్లలకు రోజు వారీ లెక్కన పారితోషికం చెల్లిస్తారట. ఈ క్రమంలో బేబీ కృతిక‌, బేబీ సహృదలకు రోజువారీ కాల్షీట్ చొప్పున‌ చెల్లిస్తారట. ఆ లెక్కన చూసుకుంటే ఈ పిల్లలకు రోజుకి రూ.20 వేల నుండి రూ.30 వేల వరకు చెల్లిస్తున్నారట. అంటే నెలలో ప‌ది రోజులు షూటింగ్ జ‌రిగినా వీళ్ల సంపాదన లక్షల్లో ఉంటుందన్నమాట!

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.