English | Telugu

బిగ్ బాస్ 5లోకి 'జబర్దస్త్' భామ!

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్ షో. ఇప్పటివరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. గతేడాది కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటూ షోని పూర్తి చేయగలిగారు. అయితే ఈ ఏడాది పరిస్థితులు దారుణంగా మారడంతో నిర్వాహకులు కాస్త జంకుతున్నారు. మరోపక్క కరోనా రూల్స్ ను అతిక్రమించారని.. మలయాళ బిగ్ బాస్ సెట్ ను పోలీసులు సీజ్ చేసి, షో షూటింగ్‌ను ఆపేశారు.

దీంతో తెలుగు షో మరింత ఆలస్యం చేయాలని చూస్తున్నారట. ఇదంతా పక్కన పెడితే షోలో ఎవరిని కంటెస్టెంట్ లుగా తీసుకోవాలనే చర్చ ఇంకా జరుగుతోందని తెలుస్తోంది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే వీలైనంత త్వరగా షోని మొదలుపెట్టాలి కాబట్టి కంటెస్టెంట్ల లిస్ట్ రెడీ చేసుకొని వారితో డీల్ కుదుర్చుకొని సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'జబర్దస్త్' బ్యూటీ వర్షను సంప్రదించారని సమాచారం.

సోషల్ మీడియాలో వర్షకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఈమెని టీవీ కోటా కింద బిగ్ బాస్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఆమెని తీసుకురావడం ద్వారా షోకి గ్లామర్ యాడ్ చేయాల‌నుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఆర్టిఫిషియల్‌ ఎఫైర్ పెట్టుకోవడానికి కూడా ఆమె ఒప్పుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటికే జబర్దస్త్ షోలో ఇమ్మాన్యుయేల్ తో అలాంటి ట్రాక్ ఒకటి నడిపిస్తోంది కాబట్టి వర్షని తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు!

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.