English | Telugu

దమ్ము కొడుతూ లుంగీతో వంటలక్క!.. నిజ‌మేనా?!

'కార్తీకదీపం' హీరోయిన్ ప్రేమి విశ్వనాధ్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దగ్గరైన ఈ మలయాళీ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటుంది. రీసెంట్ గా తన సొంత రాష్ట్రం కేరళకు చెక్కేసిన ప్రేమి.. ఇంట్లో పలు రకాల వంటకాలను ప్రిపేర్‌ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో ఎరుపు రంగు లుంగీ, పసుపు రంగు చొక్కా, తలపాగా, ఒక చేతిలో కోడిని మరో చేత్తో కత్తిని పట్టుకొని.. నోట్లో సిగరెట్ పెట్టుకొని.. పొగ వదులుతూ 'సిత్తరాల సిరపడు' అంటూ 'అల.. వైకుంఠపురములో' అల్లు అర్జున్ మాదిరిగా ఊరమాస్ గెటప్ లో కనిపించి సర్ప్రైజ్ చేసింది.

ఈ వీడియోను షేర్ చేస్తూ ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. మేకోవర్ వీడియో త్వరలో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వంటలక్క దమ్ము కొడుతూ ఉన్న మాస్ అవతారాన్ని చూసి అభిమానులు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. నీలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా.. వంటలక్కా..? అంటూ ఆశ్చర్యపడుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.