English | Telugu
ఈ సారి మిస్ అవ్వొద్దు.. దీప మర్డర్ కి ప్లాన్ ఫిక్స్!
Updated : Sep 14, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -149 లో... కార్తీక్ దగ్గరికి దీప వస్తుంది. వద్దని మాకు చెప్పావ్ దీపకి చెప్పలేదా అని జ్యోత్స్న అనగానే.. చెప్పినా నేను వినను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో సాయం చేయడానికి వచ్చానని దీప అంటుంది. అంటే వంటమనిషిగానా లేక పనిమనిషిగానా అని పారిజాతం అడుగుతుంది. మనసున్న మనిషి గా వచ్చిందని కార్తీక్ అంటాడు. వాడిని రెస్ట్ తీసుకోనివ్వండని కాంచన అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న వాళ్ళు అందరు హాల్లోకి వస్తారు. ఇంట్లో పనులు చెయ్యడానికి.. నువ్వు ఎందుకు ఇంటికి కాబోయే కోడలు ఉంది కదా అని పారిజాతం అంటుంది. జ్యోత్స్నకి వంట వచ్చా అని కాంచన అంటుంది. నేను చేస్తాను కదా అని పారిజాతం అనగానే.. అయితే బట్టలున్నాయి ఉతుకుతానని అనగానే పారిజాతం షాక్ అవుతుంది. చేయించుకునే వాళ్ళు ఈ పనులు చేయమంటే చెయ్యరు.. జ్యోత్స్న గారాబంగా పెరిగిందని కాంచన అంటుంది. జ్యోత్స్న నువ్వు వెళ్లి బావకి జ్యూస్ ఇవ్వమని చెప్పగానే జ్యోత్స్న వెళ్తుంది. తను వెళ్లేసరికి కార్తీక్ శౌర్యతో ఫోన్ మాట్లాడతాడు. దీపని పిలువు జ్యోత్స్న అని కార్తీక్ అంగగానే జ్యోత్స్నకి కోపం వస్తుంది. వెళ్లి దీపకి చెప్పి కోపంగా పారిజాతాన్ని తీసుకొని వెళ్తుంది. మరొకవైపు కాశీ తన ప్రేమ విషయం దాస్ కి చెప్తాడు. స్వప్న బయటే ఉందని కాశీ అనగానే కోడలిని బయట ఉంచావ్.. నేను మీ పెళ్లికి ఒప్పుకుంటున్నాను.. అది కూడా అమ్మాయి పేరెంట్స్ ఒప్పుకోవాలి. అప్పుడే పెళ్లి అని దాస్ అంటాడు.
ఆ తర్వాత జ్యోత్స్నతో పారిజాతం మాట్లాడుతుంది. అన్ని పనులు నేర్చుకో.. నువ్వు కార్తీక్ కి దగ్గర గా ఉండు దాన్ని చూసి మనం రావడమేంటి? నువ్వు ఎవరివో గుర్తు పెట్టుకో.. అసలు నిజం తెలిసేవరకు నువ్వు కార్తీక్ భార్యవి అయితే నీ స్థానం ఉంటుంది. అప్పుడు నిజం తెలిసిన నీకు ప్రాబ్లమ్ రాదని పారిజాతం అంటుంది. నువ్వు ఇప్పుడే కార్తీక్ దగ్గరికి వెళ్ళమని పారిజాతం కార్ దిగి ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. అప్పుడే నరసింహా జ్యోత్స్న దగ్గరికి వచ్చి డబ్బులు కావాలని అడుగుతాడు. ఆ దీపని ఎటాక్ చేయమంటే నా బావని పొడిచావని జ్యోత్స్న కోప్పడుతుంది. ఇప్పుడు నిన్ను పోలీస్ లు వెతకుతున్నారు.. ఆ లోపు నువ్వు అనుకున్నది చేయంటూ నరసింహాకి జ్యోత్స్న డబ్బులు ఇస్తుంది. ఆ తర్వాత దీప కార్తీక్ కి భోజనం తీసుకొని వస్తుంది. చాలా బాగున్నాయ్ మా రెస్టారెంట్ లో వర్క్ చేయొచ్చు కదా అని కార్తీక్ అంటాడు నేను వంట చేసి దగ్గరికి నర్సింహా వచ్చి ఇలా చేసాడు. ఇప్పుడు రెస్టారెంట్ లో వర్క్ చేస్తే వాడు ఊరుకుంటాడా అని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.