English | Telugu

ప్రదీప్‌కి శ్రీముఖి లవ్ ప్రపోజల్! కెమిస్ట్రీ వ‌ర్క‌వుట్‌!!

బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యాంకర్ ప్రదీప్ ఒకరని చెప్పాలి. ప్రదీప్ పెళ్లిపై ఏకంగా ఓ టీవీ షో కూడా చేసేశారు. ఎప్పటికప్పుడు ప్రదీప్ పెళ్లి విషయం హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇదిలా ఉండగా.. చాలా రోజులుగా శ్రీముఖి-ప్రదీప్ మధ్య కెమిస్ట్రీ పండించే విధంగా కొన్ని షోలను ప్లాన్ చేస్తున్నారు. కానీ అవేవీ వర్కవుట్ అవ్వడం లేదు. ఈసారి ఏకంగా ఓ షోలో శ్రీముఖితో ప్రదీప్‌కి లవ్ ప్రపోజల్ చేయించారు.

తాజాగా విడుదలైన 'డ్రామా జూనియర్స్ - ద నెక్స్ట్ సూపర్ స్టార్' అనే షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తోన్న ఈ షోలో శ్రీముఖి ఎంట్రీ ఇచ్చింది. ముందుగా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ముసుగు వేసుకొని వచ్చింది.

'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలో 'అందాలలో అహో మహోదయం' అనే పాటకు ప్రదీప్ చుట్టూ తిరుగుతూ డాన్స్ చేసింది. అనంతరం నీకొక విషయం చెప్పాలంటూ "ఐ లవ్యూ" చెప్పేసింది. అది విన్న ప్రదీప్ తెగ సిగ్గుపడిపోయాడు. ఈ సీన్ చూసిన సింగర్ సునీత, అలీ, ఎస్వీ కృష్ణారెడ్డి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.