Read more!

English | Telugu

ఆనందంలో జోర్దార్ సుజాత, అదిరే అభి

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది. ఆ పేరుతో  మూవీస్ లో  కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. జబర్దస్త్ మొదలైనప్పుడు అదిరే అభి స్కిట్స్ వేసి ఆడియన్స్ ని  ఎంటర్టైన్ చేసేవాడు. వాళ్ళ తర్వాత ఎంతో మంది జబర్దస్త్ కి వచ్చారు. వారిలో లేడీస్ కూడా ఎంటరయ్యి స్కిట్స్ వేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అందులో జోర్దార్ సుజాత కూడా ఉంది. కమెడియన్ గా మొదలై తర్వాత టీంలీడర్ ఐన రాకింగ్  రాకేష్ స్కిట్స్ లో చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. సుజాతకు మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తున్నాయి. యాడ్స్ లో నటిస్తోంది, వెబ్ సిరీస్ చేస్తోంది, బుల్లితెర మీద షోస్, ఈవెంట్స్ లో మెరిసిపోతోంది.

ఆమె సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గానే ఉంటుంది. అటు ఇన్స్టాగ్రామ్, ఇటు యూట్యూబ్ లో కూడా తన డీటెయిల్స్ అన్ని కూడా ఫాన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీస్ అందరికీ బ్లూ టిక్స్ వెరిఫీడ్ ఇయర్ గా మారిపోయింది. రీసెంట్ గా గీతూ రాయల్ పేజీకి బ్లూ టిక్ పడింది. అలాగే ఫైమా కూడా ఆ బ్లూ టిక్ కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడు ఆ కోవలోకి వచ్చి చేరారు అదిరే అభి, జోర్దార్ సుజాత...వీళ్లిద్దరి ఫేస్బుక్ పేజీ, ఇన్స్టాగ్రామ్ పేజీ వెరిఫై ఐపోయి బ్లూ టిక్స్ వచ్చేసరికి పండగ చేసుకుంటున్నారు. తన ఫాన్స్ కి, టెక్నికల్ టీంకి ఈ సందర్భంగా తన పేజీ ద్వారా థ్యాంక్స్ కూడా చెప్పారు. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కూడా సుజాతకు, అభికి  విషెస్ చెప్తున్నారు.