Read more!

English | Telugu

బోల్డ్ లుక్ లో బ్రహ్మముడి సీరియల్ ‌రుద్రాణి!

షర్మిత గౌడ.. ఈ పేరంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కానీ స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బ్రహ్మముడి' సీరియల్ లో రుద్రాణి అంటే అందరు ఇట్టే గుర్తుపడతారు. బ్రహ్మముడి సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్న రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ ఇప్పుడు ‌హాట్ టాపిక్ గా మారింది. లేడి విలన్ రుద్రాణి గా బ్రహ్మముడి సీరియల్ లో తనదైన నటనతో ఆకట్టుకుంటుంది షర్మిత గౌడ. ఈ సీరియల్ లో రాజ్ కి మేనత్తగా యాక్టింగ్ ఇరగదీస్తుంది. గ్యాప్ దొరికినప్పుడల్లా రాజ్ వాళ్ళ అమ్మ అపర్ణని ఇరికిస్తూ తన పగని తీర్చుకుంటుంది రుద్రాణి.

షర్మిత కర్ణాటకలో పుట్టింది. మిస్ కర్ణాటక రన్నరప్ గా నిలిచి ఫేమస్ అయింది. దాంతో కన్నడలో పలు సీరియల్స్ లో నటించే అవకాశం రాగా.. అందులో తను చేసిన నెగెటివ్ రోల్స్ తో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దాంతో తమిళ్ సీరియల్స్ లో కూడా ఆఫర్స్ వచ్చాయి. తమిళ్ సీరియల్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో, ఆ తర్వాత తెలుగులోనూ ఆఫర్ వచ్చింది. బ్రహ్మముడి సీరియల్ తన తొలి తెలుగు సీరియల్ కావడం విశేషం. తొలి సీరియలే అయినా మంచి పాత్రని పోషిస్తుంది. ప్రేక్షకులకు రుద్రాణిగా పరిచయం అయి.. దుగ్గిరాల ఫ్యామిలీని విడగొట్టే ప్రయత్నం చేస్తూ రాజ్ మేనత్త గా మంచి క్రేజ్ సంపాదించుకుంటుంది. 

షర్మిత తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో తెలుగు సినిమాలలోని ట్రెండింగ్ లో ఉన్న పాటలకి డ్యాన్స్ చేస్తూ ఫేమస్ అవుతుంది. ఇలా ఇన్ స్టా రీల్స్ లో ఎప్పుడు ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్న షర్మిత.. ఇప్పుడు తాజాగా తను సమ్మర్ వెకేషన్ కి వెళ్ళినట్లుగా కొన్ని ఫోటోలని షేర్ చేసింది. ఈ పోస్ట్ లని చూసిన ఇన్ స్టా అభిమానులు షాక్ అవుతున్నారు. కారణం బ్రహ్మముడి సీరియల్ లో ప్రతీ పాత్ర తెలుగింటి సంప్రదాయంకి పెట్టింది పేరు అన్నట్లుగా ఉంటుంది. షర్మిత అలియాజ్ రుద్రాణి ఈ సీరియల్ లోని పాత్రకి తగ్గట్టుగా ఉంటుంది. చీరకట్టులో సంప్రదాయబద్ధంగా ఉండే రుద్రాణి తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ షేర్ చేసింది.  'Say hi to hotness' అనే క్యాప్షన్ తో బ్లూ కలర్ బికినిలో దర్శనమిచ్చింది. వియాత్నంలో తను సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా షేర్ చేసిన ఈ హాట్ ఫోటోస్.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. అయితే చీరలో ఎంతో అందంగా కనిపించే రుద్రాణిని అలా చూడడంతో బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.