Read more!

English | Telugu

ఓంకార్ ని పెళ్లి చేసుకుంటానన్న స్రవంతి...

సిక్స్త్ సెన్స్ సీజన్ 5 కి ఎంతో మంది సెలబ్రిటీస్ ని తీసుకొచ్చి గేమ్స్ ఆడిస్తున్నాడు యాంకర్ ఓంకార్. ఈ వారం ఫేమస్ టీవీ న్యూస్ రీడర్స్ తో పాటు బిగ్ బాస్ నుంచి కొంత మంది సెలబ్రిటీస్ కి కూడా ఇన్వైట్ చేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 నుంచి  గీతూ రాయల్, ఆదిరెడ్డితో పాటు ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ లో ఆడిన స్రవంతి, శివ కూడా వచ్చారు. "వచ్చినప్పటి నుంచి ఈ విషయం చెప్పకుండా ఉన్నా..అదేంటంటే..చిన్నప్పుడు నేను మా అమ్మకు చెప్పాను..నేను పెద్దయ్యాక ఓంకార్ గారిని పెళ్లి చేసుకుంటా అని..నాకు తెలీదు కానీ చిన్నప్పటి నుంచి మీ మీద క్రష్ ఉంది నాకు" అని చెప్పింది స్రవంతి. "పది లక్షల కోసమేగా" మాకు తెలుసులే అని గీతూ చెప్పేసరికి "అస్సలు డబ్బులు అవసరం లేదు. ఓంకార్ గారు ఉంటే చాలు" అంది స్రవంతి. బిగ్ బాస్ తర్వాత "ఆది నీలో ఇంత డాన్సా.. నీకు డాన్స్ వచ్చేసింది" అన్నాడు ఓంకార్. డాన్స్ వచ్చిన వాడికి స్టెప్స్ రావాలి..అదే డాన్స్ రానివాడికి వేసినవే స్టెప్స్ . నాకు చాలా ఈజీ..ఎక్కడైనా అవే స్టెప్స్ కదా.

ఆది మూవీ రావడానికి పదేళ్ల ముందు పుట్టాను. నాకు చాలా పెద్ద పేరు ఉంది. బొడ్డు వెంకట ఆది నారాయణ రెడ్డి" అని చెప్పాడు. గీతూ రాయల్ లో ఈ రాయల్ ఏమిటి అని అడిగాడు..." మా తాతముత్తాతలు శ్రీకృష్ణ దేవరాయలు ఫామిలీకి చెందిన వాళ్ళం అని మా అమ్మానాన్న చెప్తూ ఉంటారు. మా ఇంట్లో అందరికి రాయలు, రాయలు అని పెట్టుకుంటారు. నేను ఆ రాయల్ ని తీసేసి రాయల్ అని పెట్టుకున్నా..వాళ్ళు చెప్తూ ఉంటారు నేను కూడా డబ్బా కొట్టుకోవచ్చు కూడా" అనేసరికి   "అంటే మీది శ్రీకృష్ణ దేవరాయల ఫామిలీన అలా అనుకోవడంలో తప్పేముందిలే" అని అడిగాడు ఓంకార్. ఆది, గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చాకా ఇంకా మంచి ఫ్రెండ్స్ ఇపోయారు. రకరకాల వీడియోస్ ని చేస్తూ అప్పుడప్పుడు బుల్లితెర మీద షోస్, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నార