English | Telugu

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

ఏమైంది వల్లి.. ఎందుకు డల్ గా ఉంటున్నావని అన్నాడు. ఈ నాలుగు చీరల్లో ఏ చీర కట్టుకోవాలో తెలియడం లేదని శ్రీవల్లి అనగానే చందు ఒకచీర సెలెక్ట్ చేస్తాడు. అది బాగుందని చందు చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి సెల్ఫీ దిగుతారు. ఆ తర్వాత రొమాంటిక్ గా వల్లి దగ్గరికి వస్తాడు చందు. అప్పుడే పెద్దోడా అని వేదవతి పిలవగానే చందు కంగారుగా వెళ్తాడు‌. దాంతో శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరోవైపు అమూల్యని కామాక్షి రెడీ చేస్తుంది. ఇక తనకి నగలు అన్నీ వేసి రెడీ చేసి పొగుడుతుంటే అమూల్య డల్ గా ఉంటుంది. అది చూసి కామాక్షికి డౌట్ వస్తుంది. ఏమైందే నీకు ఎందుకు ఇలా ఉన్నావ్.. ఏమైనా లవ్ స్టోరీలున్నాయా అని కామాక్షి అంటుంది. అప్పుడే వేదవతి వచ్చి.. తన మీద సీరియస్ అయి.. అమూల్యకి కంగారుగా ఉందని చెప్పి కవర్ చేస్తుంది. ఇక అమూల్యని రెడీ చేసాక దిష్టి తీస్తుంది వేదవతి. ఆ దిష్టి నీళ్ళని పడేయమని తిరుపతికి ఇస్తుంది వేదవతి. అతను లవ్ ఫెయిల్ అయిందని భాదలో వాటిని బయటకు తీసుకెళ్తాడు.

మరోవైపు భాగ్యం, ఆనందరావు ఇద్దరు కలిసి రెడీ అయి ఇంటి గేట్ దాకా వస్తారు. వారిని చూసుకోకుండా తిరుపతి దిష్టి నీళ్ళు పడబోస్తాడు. ఆ నీళ్ళు ఆనందరావు మీద పడి తెల్ల డ్రెస్ ఎర్రగా మారిపోతుంది. ఇక తిరుపతి మీద భాగ్యం సీరియస్ అవుతుంది. చూస్కోలేదని తిరుపతి సారీ చెప్పగానే ఇద్దరు లోపలికి వెళ్తారు. మరోవైపు నర్మద దగ్గరికి సాగర్ వస్తాడు. నర్మద మల్లెపూల వాసన కనిపెట్టి వచ్చారా అని అడుగుతుంది. నా చూపులు నీ వీపుకి గుచ్చుకున్నాయా అని సాగర్ అనగానే అదేం లేదు.. నువ్వు తెచ్చిన మల్లెపూల వాసనతో కనిపెట్టానని నర్మద అంటుంది. భార్య కోసం ఎవరైన స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొస్తారు.. నీకు ఈ మల్లెపూల ఫాంటసీ ఏంట్రా బాబు అని నర్మద అంటుంది. ఒక మల్లెచెట్టుకు రోజు గ్లాసెడు నీళ్ళు పోస్తే అది గుప్పెడు మల్లెపూలని ఇస్తుందని సాగర్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.