English | Telugu

'జాన‌కి క‌ల‌గ‌న‌లేదు' హీరో బ్రేక‌ప్ స్టోరీ!

'జానకి కలగనలేదు' సీరియల్ లో హీరోగా నటిస్తోన్న అమర్ దీప్ చౌదరి తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 60 ఎపిసోడ్ లను పూర్తి చేసుకున్న ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు అమర్ దీప్. ఈ క్రమంలో తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి యూత్ కి ఓ మెసేజ్ ఇచ్చాడు. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన అమర్ తన లైఫ్ లో కూడా ఓ బ్రేకప్ స్టోరీ ఉందని చెప్పాడు.

లవ్ ఫెయిల్యూర్ అంటే ఇద్దరిలోనూ మిస్టేక్ ఉంటుందని... లవ్ ఫెయిల్ అయ్యిందని.. హ్యాండ్ ఇచ్చిందని పగలు కోపాలు పెంచుకోవడం లాంటివి కరెక్ట్ కాదని అన్నాడు. కానీ.. లవ్‌లో ఫేక్ ప్రామిస్‌లు ఉండకూడదని.. వాళ్లలో లేనిపోని ఆశల్ని కలిగించకూడదని చెప్పాడు. అప్పటి వరకు కలిసి ఉండి ఆ తర్వాత హ్యాండ్ ఇస్తే అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తట్టుకోలేరని.. వీక్ హార్ట్ అయితే చచ్చిపోతాడు.. లేదంటే చంపేస్తాడని చెప్పుకొచ్చాడు.

ఏడిస్తే అమ్మాయి తిరిగి వస్తుందనుకుంటే.. ఎన్నాళ్లైనా ఏడవవ‌చ్చని, కానీ రాదు అని తెలిసినప్పుడు వదిలేయాల‌నీ అన్నాడు. "అమ్మాయిల్లో ఓ విషయాన్ని గమనించాను.. వాళ్లు వద్దు అనుకుంటే కనీసం వెనక్కి తిరిగి కూడా చూడరు. ఒక్కసారి మనసు విరిగిపోయిందంటే ఏం చేసినా అతుక్కోదు.. మళ్లీ మనవైపు చూడరు.. అలాంటప్పుడు నిన్ను నువ్వు బాధపెట్టుకోవడం.. ఇంట్లో వాళ్లని బాధపెట్టడం.. ప్రేమించిన అమ్మాయిని బాధపెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు." అని చెప్పుకొచ్చాడు. తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎదురైంది కాబట్టి చెబుతున్నానని.. త‌న‌ బ్రేకప్ స్టోరీ వెల్ల‌డించాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.