English | Telugu

"ఎంత ప‌నిచేశావ్ డాక్ట‌ర్ బాబు?".. వెన్నెల కిశోర్ కూడా 'కార్తీక‌దీపం' ఫ్యాన్‌!

'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని తెలుగు వారుండరు. బుల్లితెరపై ఈ సీరియల్ ఓ సంచలనం. ఇప్పటివరకు ఏ సీరియల్ కూడా దీన్ని బీట్ చేయలేకపోతోంది. టీఆర్పీలో ఈ సీరియల్ ఎప్పుడు టాప్ ప్లేస్ లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈ సీరియల్ హాట్ టాపిక్ అవుతుంటుంది. సెలబ్రిటీలు సైతం అప్పుడప్పుడు ఈ సీరియల్ గురించి మాట్లాడుతుంటారు. మొన్నామధ్య లక్ష్మీ మంచు 'కార్తీకదీపం' సీరియల్ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేసింది.

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కమెడియన్ వెన్నెల కిశోర్ అప్పుడప్పుడు ఈ సీరియల్ మీద సెటైర్లు వేస్తుంటారు. రీసెంట్ గా డాక్టర్ బాబు, వంటలక్క మీద వెన్నెల కిశోర్ వేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. "అంత మంచి డాక్టర్ బాబుకి అంత మంచి వంటలక్క అంటే ఎందుకంత కోపం?" అని ట్వీట్ చేశారు. అది కాస్తా నెట్టింట్లో వెైరల్ అయింది.

ఇప్పుడు 'కార్తీకదీపం' సీరియల్ మలుపు తీసుకున్న సంగతి తెలిసిందే. మోనితా కడుపుతో ఉన్నానని.. దానికి కారణం కార్తీక్ అని చెప్పడంతో అందరూ డాక్టర్ బాబునే టార్గెట్ చేస్తున్నారు. దీనిపై రకరకాల మీమ్స్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాటిలో ఒక మీమ్ ను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు. "ఎంత పని చేశావ్ డాక్టర్ బాబు?" అంటూ బ్రహ్మానందం స్టైల్లో ఉన్న మీమ్‌ను వెన్నెల కిశోర్ షేర్ చేయగా దాన్ని నిరుపమ్ తన ఇన్ స్టాలో స్టోరీలో పెట్టుకున్నాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.