English | Telugu

"దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే!"

'జబర్దస్త్'లో హైపర్ ఆది స్కిట్ లకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రత్యేకించి ఆయన కోసమే షోని చూసేవాళ్లు చాలా మంది ఉన్నారు. డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు పంచ్ లతో రెచ్చిపోతుంటాడు ఆది. అయినప్పటికీ అతడి స్కిట్ లకు మిలియన్లలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా వచ్చే వారానికి సంబంధించిన 'జబర్దస్త్' ప్రోమోను విడుదల చేయగా.. ఇందులో హైపర్ ఆది, రామ్ ప్రసాద్ తో క‌లిసి నవ్వించే ప్రయత్నం చేశాడు.

ఒక పేపర్ పట్టుకొని వచ్చి "నువ్వు చ‌దువు" అంటే "నువ్వు చదువు" అనుకుంటూ "ఇద్దరికీ రాదులే" అంటూ చిన్న పంచ్ తో స్కిట్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తనను తాను వెధవ అని ఒప్పుకుంటూ.. ''నేను నెంబర్ 1 వెధవ..".. రామ్ ప్రసాద్ ను చూపిస్తూ "వీడు నెంబర్ 2 వెధవ" అని కామెంట్ చేశాడు. వెంటనే రామ్ ప్రసాద్ "నన్ను పిలిచి ఇన్సల్ట్ చేస్తావా.. నెంబర్ వన్ నాకే ఇవ్వు" అన్నాడు. ఆది "స‌రే" అన‌గానే అంతా గొల్లున న‌వ్వేశారు.

ఇక లేడీ గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన శాంతి స్వరూప్.. "మొన్న ఒకడు నన్ను చూసి చేయి కోసుకున్నాడు" అని అన్నాడు. దానికి హైపర్ ఆది.. "దూరం నుంచి చూశాడు కాబట్టి చేయి కోసుకున్నాడు.. దగ్గర నుంచి చూస్తే ఉప్పెనే" అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. 'ఉప్పెన' సినిమాలో క్లైమాక్స్ సీన్ ను ఉద్దేశిస్తూ ఈ పంచ్ వేశాడు. ఈ పంచ్ లకు మ‌నో, రోజా, అనసూయ పడిపడి మరీ నవ్వుకున్నారు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.