English | Telugu

"ఆఫర్ ఇస్తే మాకేంటి అంటున్నారు".. సీరియల్ నటి ఆవేదన!

కొన్నిరోజులుగా స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'జానకి కలగనలేదు' సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సీరియల్ లో పనిమనిషి క్యారెక్టర్ లో నటిస్తోన్న చికిత (రమ్య) తన నటనతో మెప్పిస్తోంది. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నటనపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కుటుంబానికి తానే ఆధారం కావడంతో ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది రమ్య. అయితే తనకు అవకాశాలు వస్తున్నాయి కానీ నాకేంటి అంటూ వేధించేవాళ్లు ఎక్కువగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

తొలిసారి 'జానకి కలగనలేదు' సీరియల్ లో ఆఫర్ వచ్చిందని.. రాశి, అమర్, ప్రియాంక లాంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లతో పని చేయడం సంతోషంగా ఉందని చెప్పింది. కెమెరా ముందు ఎలా చేయాలో తనకు తెలియకపోతే వాళ్లే హెల్ప్ చేశారని చెప్పుకొచ్చింది. అనంతరం ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. అందరూ అమ్మాయిలను అదే ఉద్దేశంతో చూస్తున్నారని.. ఒక్కోసారి ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని అనిపిస్తోంద‌ని.. ఎందుకు బతికున్నానా..? అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది.

తన ఇంట్లో ఆర్థిక‌ ఇబ్బందుల కారణంగా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చిందని.. వచ్చిన తరువాత క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు వచ్చాయని చెప్పింది. అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు నో చెప్పేదాన్ని అనీ, అందుకే సరైన అవకాశాలు రాలేదనీ తెలిపింది. కానీ 'జానకి కలగనలేదు' టీమ్ వాళ్లు సాయం చేయడంతో తనకు అవకాశం వచ్చిందని అంటూ.. టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు చెప్పింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.