English | Telugu

ఆర్జీవీతో ఇంటర్వ్యూ.. టెన్షన్‌లో అరియానా!

అప్పటివరకు అరియానా గ్లోరీ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆర్జీవీను ఇంటర్వ్యూ చేసి సూపర్ పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఈ ఇంటర్వ్యూ కారణంగానే ఆమెకి బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చింది. ఈ షో అరియానాకు మరింత క్రేజ్ ను తీసుకొచ్చింది. దీంతో హౌస్ నుండి బయటకొచ్చిన తరువాత ఆమెకి పలు టీవీ షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. రీసెంట్ అరియనా ట్విట్టర్ లో ఓ ఫోటో షేర్ చేసింది.

అందులో ఆర్జీవీ, అరియనా జిమ్ డ్రెస్ లో కనిపించారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ వర్మను మరోసారి ఇంటర్వ్యూ చేసినట్లు తెలిపింది అరియానా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే.. ఆర్జీవీ ప్రత్యేకించి తనతో ఓ ఇంటర్వ్యూ చేయమని అరియానాను కోరాడట. పైగా ఆ ఇంటర్వ్యూ కూడా డిఫరెంట్ గా యాంకర్-గెస్ట్ ఇద్దరూ జిమ్ లో కసరత్తులు చేస్తూ ఉండేలా ఒక థీమ్ తో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇంటర్వ్యూ పూర్తయిందని.. ఆర్జీవీనే ఎడిటింగ్ బాధ్యతలు, ప్రోమో కటింగ్ పనులు పూర్తి చేశారని.. ఆ తరువాత అరియానాను పిలిచి ప్రోమోను చూపించినట్లు తెలుస్తోంది. ఇది చూసిన అరియనా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సన్నిహితుల వద్ద టెన్షన్ పడినట్లు సమాచారం. అరియానా అంతలా టెన్షన్ పడుతుందంటే.. ఈ ఇంటర్వ్యూ మొత్తం వర్మ స్టైల్ లో పొగడ్తలు, హాట్ కామెంట్స్ తో నిండిపోయి ఉందనిపిస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.