English | Telugu

ముందు ఆయ‌న ప్రేమించారు.. ఆ త‌ర్వాత నేను ప్రేమించాల్సి వ‌చ్చింది!

నటి హరితేజ గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో బుల్లితెరపై సీరియల్స్ లో నెగెటివ్ రోల్స్ లో నటించిన ఆమె ఆ తరువాత బిగ్ బాస్ షోలో తన కామెడీతో అందరినీ నవ్వించింది. బిగ్ బాస్ షో కార‌ణంగా హరితేజకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ షో తరువాత ఆమెకి అవకాశాలు కూడా బాగా పెరిగాయి. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది హరితేజ.

తరచూ తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతూ పలు రకాల కామెంట్స్ చేస్తుంటుంది. అలాంటి హరితేజ కొన్నాళ్లుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. ఆమె ప్రెగ్నంట్ గా ఉన్నప్పుడు కూడా పలు ఫోటో షూట్లు, డాన్స్ లు షేర్ చేస్తూ రచ్చ చేసింది. బిడ్డ పుట్టిన తరువాత హరితేజ సోషల్ మీడియాలో కాస్త దూరమైంది. అయితే రీసెంట్ గా లైవ్ చాట్ ద్వారా తన ఫాలోవర్లను పలకరించింది. ఈ క్రమంలో నెటిజన్లు పలు రకాల ప్రశ్నలతో ఆమెని ఉక్కిరిబిక్కిరి చేసేశారు.

హరితేజది ప్రేమ వివాహమనే సంగతి కొంతమంది మాత్రమే తెలుసు. ఇదే విషయాన్ని తాజాగా ఓ నెటిజన్ అడిగాడు. "మీది ప్రేమ వివాహమా..? పెద్దలు కుదిర్చిన వివాహమా..?" అని ప్రశ్నించాడు. దీనికి హరితేజ 'మన్మథుడు' సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు.. ''ముందు ఆయన ప్రేమించారు.. ఆ తరువాత నేను ప్రేమించాల్సి వచ్చింది.. ఇంకా ఇంట్లో వాళ్లకి ఆప్షన్ ఏముంది'' అంటూ ఫన్నీగా బదులిచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.