English | Telugu

గెస్ట్‌గా వ‌చ్చి.. ప‌ర్మినెంట్ ఆర్టిస్ట్‌గా మారి.. జ‌బ‌ర్ద‌స్త్‌ వ‌ర్ష ముద్ర‌!

మోడల్ గా కెరీర్ ఆరంభించిన వర్ష.. బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశం దక్కించుకుంది. 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియల్స్ లో కనిపించింది. అందంతో పాటు యాక్టింగ్ లోనూ రాణించడంతో నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. సీరియల్ లో నటిగా బిజీగా ఉన్న సమయంలోనే టాప్ కమెడియన్ హైపర్ ఆది చొరవతో 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

కేవలం గెస్ట్ గా వచ్చిన ఆమె.. తన కామెడీ టైమింగ్ తో 'జబర్దస్త్' షోలో పర్మినెంట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ లతో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్ టీమ్ లలో పని చేస్తోంది. అదే సమయంలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోంది. 'జబర్దస్త్' లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వర్ష కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అలానే ఆ షోలో యంగ్ కమెడియన్ ఇమ్మానుయేల్ తో ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలతో మరింత పాపులర్ అయింది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ గ్లామరస్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ టాప్ వేసుకొని గ్లామర్ షో చేస్తూ కనిపించింది. తన నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ యూత్ ను ఆకర్షిస్తోంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.