English | Telugu

ఆ హీరోయిన్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో!

చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు బాలాదిత్య. 'లిటిల్ సోల్జర్స్', 'హిట్లర్', 'అబ్బాయిగారు', 'హలో బ్రదర్'.. ఇలా చాలా సినిమాల్లో బాలనటుడిగా కనిపించాడు. ఒకప్పటి స్టార్ హీరోలందరి చిన్నప్పటి పాత్రలను కూడా బాలాదిత్యనే పోషించేవాడు. ఆ తరువాత 'చంటిగాడు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. కానీ అతడికి అవకాశాలను తీసుకురాలేకపోయింది.

ఇటీవలే బాలాదిత్య నటించిన 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం బాలాదిత్య పలు సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. గతంలో 'చంటిగాడు', 'సుంద‌రానికి తొంద‌రెక్కువ' సినిమాల్లో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసినిని బాలాదిత్య పెళ్లి చేసుకున్నట్లు గ‌తంలో వార్తలొచ్చాయి. ఆమె కూడా కొన్ని సినిమాల్లో న‌టించి, త‌ర్వాత టీవీ సీరియ‌ల్ తార‌గా స్థిర‌ప‌డిన విష‌యం తెలిసిందే. త‌మ‌ పెళ్లి ప్ర‌చారంపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు బాలాదిత్య.

ఆ వార్తల్లో నిజం లేదని అన్నాడు. ఎప్పుడైనా ఫంక్షన్స్‌కు వెళ్లినప్పుడు సుహాసినితో కలిసి ఒకే కారులో వెళ్లేవాడినని.. అది చూసి కొందరు తప్పుగా అనుకున్నారని చెప్పుకొచ్చాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరం కలిసి రెండు సినిమాల్లో నటించేసరికి పెళ్లి చేసుకున్నామంటూ వార్తలు రాసేశారని.. నిజానికి త‌మ‌ ఇద్దరికీ అలాంటి అభిప్రాయమే లేదని స్పష్టం చేశాడు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.