English | Telugu

Jayam serial: సన్మానంలో గంగ, రుద్రలకి అవమానం.. పారు ప్లాన్ హిట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -183 లో... గంగ, రుద్ర మాఫియా గ్యాంగ్ నుండి కొంతమంది అమ్మాయిలను సేవ్ చెయ్యడంతో వారిద్దరికి సన్మానం ప్లాన్ చేస్తారు. సన్మానానికి పెద్ద సారు కుటుంబంతో వస్తాడు.

అక్కడ గంగ గురించి ఒకతను గొప్పగా చెప్తాడు. తను ఒక పేపర్ చూస్తూ చెప్తాడు. అందులో పారు ప్లాన్ చేసినట్టుగా గంగ గురించి తక్కువ చేసి మాట్లాడినట్లు ఉంటుంది. గంగ వాళ్ళ నాన్న తాగుబోతు.. వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉంటుంది. పూట గడవని సిచుయేషన్ గంగ అన్ని పనులు చేసేదని ఉంటుంది.

దాంతో గంగ స్టేజ్ పైకి వెళ్లి ఇప్పటివరకు అందరు చెప్పింది నిజమే.. నేను నా కుటుంబం గడవడం కోసం చాలా కష్టపడ్డాను కానీ అన్యాయం చెయ్యలేదు.. మా అమ్మ విలువలతో నన్ను పెంచింది.. నేను చేసిన పనికి నామోషీగా ఫిల్ అవ్వనని గర్వంగా చెప్పుకుంటానని గంగ అంటుంది. ఇది అవమానం అయినా ప్రశంసగా మార్చుకుందని ఇషిక, పారు అనుకుంటారు.

ఆ తర్వాత గంగ, వీరుకి సంబంధించిన ఒక వీడియో ప్లాన్ చేసామని అక్కడున్న వాళ్ళు అంటారు. అందులో మొదట్లో ఇద్దరి గురించి గొప్పగా ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి గంగ అకాడమీలో డ్యాన్స్ చేసినట్లు ఉంటుంది. రుద్ర అరెస్ట్ అయింది ఉంటుంది. అది చూసి ఇలా పిలిచి మరీ అవమానిస్తారా అని సూర్య అక్కడున్న వాళ్లపై కోప్పడతాడు. సూర్య నువ్వు కూల్ అని రుద్ర అంటాడు.

రుద్ర స్టేజ్ పైకి వెళ్లి తనని పోలీసులు అరెస్ట్ చేసిన దాని గురించి క్లారిటీ ఇస్తాడు. ఈ సన్మానం మా పెద్దమ్మ పెద్దనాన్న చేతులు మీదుగా జరగాలని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.