English | Telugu

ఇంట్లో ఉంటూనే సంపాదించేస్తోన్న సుమ! ఎలా అంటే...

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా దూసుకుపోతోంది సుమ. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆమెకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరపై టీవీ షోలు, సినిమా ఈవెంట్లు అంటూ సుమ చాలా బిజీగా ఉంటోంది. గ్యాప్ లేకుండా వరుస షోలతో భారీ సంపాదన ఆర్జిస్తోంది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో చాలా మంది వర్క్ లేక ఇబ్బంది పడుతున్నారు. సుమ కూడా మొన్నామధ్య ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా వాళ్లకు ఉపాధి లేకుండా పోయిందంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఇదిలా ఉంటే.. సుమ ఇంట్లో ఉంటూనే సంపాదించడం మొదలుపెట్టింది. పలు ప్రొడక్ట్ లను ప్రమోట్ చేస్తూ వాటికి అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈమె ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది. "ఇడ్లీ దినోత్సవం" అంటూ ఈమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇలా ఏదో ఒక డే ఉన్నప్పుడు ఇడ్లీకి ఓ డే ఉండకూడదా? అంటూ వేడి వేడి ఇడ్లీలను తయారు చేసింది.

దాని కోసం ఒక కంపెనీ వారు చేసిన స్పెషల్ పొడులను ప్రమోట్ చేసింది. పుట్నాల పొడి, కారంపొడి, తనకెంతో ఇష్టమైన చల్ల మిరపకాయల పొడి ఉన్నాయని వారి ఉత్పత్తులను వివరిస్తూ ప్రమోట్ చేసింది. ఈ పొడులు కావాల్సిన వారు వాట్సప్ చేయొచ్చు లేదా వెబ్ సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు అంటూ సుమ తన స్టైల్లో ప్రమోషన్ చేసింది. మొత్తానికి ఇంట్లో ఉంటూ ప్రమోషన్స్ తోనే డబ్బులు సంపాదించేస్తోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.