English | Telugu

"ద‌గ్గ‌ర్నుంచి చూస్తుంటే భ‌య‌మేస్తోంది".. అషురెడ్డి పరువు తీసేసిన స్టూడెంట్!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై కామెడీ షోలలో బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువైపోయాయి. యాంకర్లు, కమెడియన్లు ఒకర్ని మించి మరొకరు డబుల్ మీనింగ్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఈ లిస్ట్ లో యాంకర్ రవి కూడా ఉంటాడు. ఈ మధ్య లాస్యతో కలిసి కామెడీ షోలు మొదలుపెట్టిన యాంకర్ రవి.. తాజాగా అషురెడ్డితో మరో కొత్త షో చేస్తున్నాడు.

బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న అషురెడ్డి ఈ మధ్యకాలంలో లవ్ ఎఫైర్లతో, తన డ్రెస్సింగ్ తో వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం రవితో కలిసి ఆమె హోస్ట్ చేస్తోన్న 'హ్యాపీ డేస్' షోకి ఓ మోస్తరు రేటింగ్‌లు వస్తున్నాయి. అప్పట్లో రవి-శ్రీముఖి కలిసి చేసిన 'పటాస్' షోకు జిరాక్స్ కాపీలా ఉంది 'హ్యాపీ డేస్' షో. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో అషురెడ్డి డబుల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోయింది.

ఈ షోకి కొంతమంది స్టూడెంట్స్ గెస్ట్ లుగా రాగా.. వారిలో ఒక అమ్మాయి "అషురెడ్డితో కలిసి యాంకరింగ్ చేస్తున్నావ్ కదా.. ఆమెతో సినిమా తీయాల్సి వస్తే ఏం సినిమా తీస్తావ్?" అని ఓ స్టూడెంట్ ప్రశ్నించగా.. దాని రవి తడుముకోకుండా "జఫ్ఫా" అని బదులిచ్చాడు. ఆ తరువాత మరో స్టూడెంట్ రవిని ఉద్దేశిస్తూ.. "మీరు చాలా మంది యాకర్స్ తో చేశారు కదా.. " అని అంటుంటే వెంటనే అషురెడ్డి "ఏం చేశాడు?" అంటూ కుళ్లు జోక్ వేసింది. ఇక అషురెడ్డిని జూనియర్ సమంత అని తెగ పొగిడిన ఓ స్టూడెంట్ స్టేజ్ మీదకొచ్చాక‌.. ర‌వితో, "అన్నా.. ఆమెను ద‌గ్గ‌ర్నుంచి చూస్తుంటే భ‌య‌మేస్తోంది." అంటూ అషు పరువు తీసేశాడు. దాంతో ర‌వి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వ‌గా, అషు తెల్ల‌బోతూ స్టూడెంట్ వంక అలాగే చూస్తుండిపోయింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.