Read more!

English | Telugu

కళ్ళు తిరిగిపడిపోయిన కావ్య.. రాక్షసత్వంగా బిహేవ్ చేసిన రాజ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-44 లో.. కావ్యని భోజనానికి తీసుకొని వస్తుంది రాజ్యలక్ష్మి . కావ్యని చూసిన అపర్ణ.. శాంత నువ్వు రాజ్ కి భోజనం వడ్డించమని కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అలాగే కావ్య వైపు రాజ్ కోపంగా చూస్తుంటాడు. కూర్చోండి వదిన అని కళ్యాణ్ అనగానే.. నాకు ఇక్కడ కూర్చుని భోజనం చెయ్యాలో? వెళ్ళిపోవాలో? అర్థం కావట్లేదని కావ్య అంటుంది. నాక్కూడా అర్థం కావట్లేదని చెప్పి రాజ్ తన ప్లేట్ లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోతాడు. ప్లేట్ లో రాజ్ వదిలేసిన అన్నం తిని వెళ్ళు.. మీరు అలాంటి భోజనం పండగలకి వండుకుంటారు కదా అని కావ్యని రేఖ అంటుంది. "అవును మేం పండగలకి వండుకొని కడుపునిండా తింటాం.. అయినా రాజ్ కి నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాననే కోపం ఉంది. మరి నీకు నాకు ఏం గొడవలు లేదు కదా.. నేను అంటే నీకు ఎందుకంత కోపమని కావ్య అంటుంది.

ఆ తర్వాత కావ్య దగ్గరికి రుద్రాణి వస్తుంది. "మీ అమ్మానాన్నలకి ఫోన్ చేశాను. వాళ్ళు ఇంకా మీ అక్క రాలేదనే బాధలోనే ఉన్నారు. నీ గురించి అడిగితే.. నువ్వు బాగున్నావ్ అని చెప్పాను" అని రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఇంకా మా అక్క రాలేదా అని కావ్య ఆలోచిస్తుంది. అందరూ పడుకున్నాక ఎవరికీ కనపడకుండా బయటకెళ్ళి పోలీస్ కంప్లెంట్ ఇవ్వడానికి కావ్య వెళ్తుంది. అలా కావ్య వెళ్ళడం చూసిన రుద్రాణి.. రాజ్ దగ్గరికి వెళ్ళి కావ్య కనిపించడం లేదు.. కావ్య ఎక్కడికో వెళ్ళిందని చెప్తుంది. ఆ తర్వాత కావ్య కోసం రాజ్ ఎదురుచూస్తుంటాడు. కాసేపటికి కావ్య చాటుగా వస్తుండగా.. ఆగు ఎక్కడికి వెళ్ళావ్ అని రాజ్ అడుగుతాడు. దాంతో కాసేపట్లోనే ఇంట్లో వాళ్ళందరూ హాల్లోకి వస్తారు. ఎక్కడికి వెళ్ళావో చెప్పమని రాజ్ తన చెయ్యి పట్టుకొని లాగేసరికి, కావ్య కళ్ళు తిరిగి కింద పడిపోతుంది.. ఏమైందని అందరూ అడుగుతారు. రోజంతా తినకుండా ఉంటే నీరసం వచ్చి పడిపోరా అని కళ్యాణ్ అంటాడు. కావ్య అన్నం తినలేదా ధాన్యలక్ష్మి? భోజనం తీసుకురాపో అని రాజ్  వాళ్ళ నానమ్మ అనగానే తను తీసుకువస్తుంది. "నేను తినను సంప్రదాయం ప్రకారం.. ఆయన భోజనం చేసిన తర్వాతే నేను చేస్తాను" అని కావ్య అంటుంది. రాజ్ కోపంతో పెళ్లి మోసం చేసి చేసుకున్నావ్.. సంప్రదాయం ప్రకారం కాదని బలవంతంగా కావ్యకి అన్నం తినిపిస్తాడు రాజ్.‌ ఇంత రాక్షసత్వంగా బెహేవ్ చేస్తున్నావ్ కదా.. నీ మీద కక్ష తీర్చుకుంటానని కావ్య అనుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది 

స్వప్న ఫోన్ చేస్తే రాహుల్ లిఫ్ట్ చెయ్యకపోయేసరికి తనలో టెన్షన్ మొదలవుతుంది. మరోవైపు కావ్య అత్తారింట్లో ఎలా ఉందోనని అప్పు ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.