English | Telugu

"నాకు నువ్విష్టం.. నిన్ను తిన‌లేను క‌దా".. మ‌ర‌ద‌లు ప్రియ‌మ‌ణితో బావ ఆది స‌ర‌సాలు!

'జబర్దస్త్' కామెడీ షోతో మంచి పాపులారిటీ దక్కించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీ అయ్యాడు. 'ఢీ' షోలో సుడిగాలి సుధీర్ తో కలిసి ఎంటర్టైన్మెంట్ పంచుతుంటాడు హైపర్ ఆది. తాజాగా విడుదలైన 'ఢీ 13' ప్రోమోలో హైపర్ ఆది చేసిన రచ్చ మాములుగా లేదు. ప్రియమణితో హైపర్ ఆది రొమాంటిక్ టూర్ వేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజం కానప్పటికీ ఆ రేంజ్ లోనే బిల్డప్ ఇచ్చారు.

ప్రియమణిని హైపర్ ఆది ఓ రిసార్ట్ కి తీసుకెళ్లినట్లు చూపించడంతో ఈ వీడియో వెంటనే వైరల్ అయింది. ఇక ఇందులో బావా మరదలుగా వాళ్లిద్దరూ రెచ్చిపోవడం బాగా హైలైట్ అయింది. 'ఢీ' డాన్స్ షోలో మెంటర్ గా ఉంటోన్న హైపర్ ఆది.. తన పంచ్ లతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజా ప్రోమోలో మాత్రం తన రొమాంటిక్ మూడ్ తో షాకిచ్చాడు.

"ప్రియా..." అంటూ హైపర్ ఆది ముద్దుగా పిలుస్తుండగా.. "బావా".. అంటూ ప్రేమగా అతన్ని పిలుస్తూ కనిపించింది ప్రియమణి. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదంటూ ఆది చెప్పిన డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. "నీకు దోశ కావాలా, ఇడ్లీ కావాలా?" అని ఆది అడ‌గ‌గా, "నీకేది ఇష్ట‌మో అదివ్వండి బావా.. నేను తింటాను." అని చెప్పింది ప్రియ‌మ‌ణి. "నాకు నువ్విష్టం.. నిన్ను తిన‌లేనుక‌దా" అని త‌న‌దైన స్టైల్‌లో ఆది పంచ్ వేశాడు. అత‌డి పంచ్‌కు ఫీలైపోయిన ప్రియ‌మ‌ణి ఆది భుజం మీద చేత్తో ట‌ప‌ట‌పా కొట్టేసింది.

వీళ్లకు పక్క రూములో పూర్ణతో సుడిగాలి సుధీర్ ఉండడం.. ఈ రెండు జోడీల మధ్య సన్నివేశాలు, వాళ్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో నిండిపోయిన ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్ లో తెగ‌ వైరల్ అవుతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.