English | Telugu

కామెడీని కామెడీలా చూడండి.. హైప‌ర్ ఆదిని వెన‌కేసుకొచ్చిన క‌మెడియ‌న్‌!

ఓ కామెడీ షోలో హైపర్ ఆది తెలంగాణ సంస్కృతిని, ఆడవాళ్లను కించపరిచారని తెలంగాణ జాగృతి విద్యార్ధి సంఘం నేతలు ఆదిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. అయితే దీనిపై ఆది క్షమాపణలు తెలియజేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా ఈ వివాదంపై జబర్దస్త్ కమెడియన్ మహిధర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఒక ప్రాంతాన్ని లేదా సంస్కృతిని హేళన చేసే వ్యక్తిత్వం హైపర్ ఆదికి లేదని మహిధర్ అన్నాడు.

ఈ ఇష్యూ చూస్తుంటే తనకొక డైలాగ్ గుర్తొస్తుందని.. మనోభావాలు ఉన్నదే దెబ్బతినడానికి అని వర్మ చెబుతుంటారని.. అవి ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉంటాయని ఆయన అంటుంటారని అన్నాడు. నిజానికి హైపర్ ఆది అయినా.. మరెవరైనా.. షోలో ఒక ప్రాంతాన్ని ఒక సంస్కృతిని కించపరచాలని అనుకోరని చెప్పాడు. కామెడీని కామెడీలా చూడటం మానేసి.. వివాదాన్ని వెతకడం అలవాటు అయిపోయిందని నిట్టూర్చాడు.

పట్టించుకోవాల్సిన విషయాలను పక్కన పెట్టేసి ఇలాంటి వాటిపై పడుతుంటారని విమర్శించాడు. స్కిట్ కోసం స్క్రిప్ట్ రాస్తే.. దాన్ని పర్సనల్ తీసుకుని ఫీల్ అయిపోతే ఏం చేయలేమని అన్నాడు. కామెడీ షోని కామెడీ షోగా చూస్తే మంచిదని అన్నారు. హైపర్ ఆదితో నాలుగేళ్లుగా పని చేస్తున్నానని.. ఆయన వ్యక్తిత్వం ఏంటో తనకు తెలుసని అన్నాడు. తెరపై పంచ్ లు వేసి నవ్విస్తుంటారేమో కానీ నిజ జీవితంలో చాలా నార్మల్ పర్సన్ అంటూ చెప్పుకొచ్చాడు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.