English | Telugu

షర్ట్ లేకుండా అఖిల్.. 'అమ్మో' అంటూ మోనాల్‌!!

బిగ్ బాస్ నాల్గో సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లందరూ తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. కొందరికి పాజిటివ్ ఇమేజ్ రాగా.. మరికొందరికి నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అయితే ఈ సీజన్ లో లవ్ ట్రాక్ లు బాగానే వైరల్ అయ్యాయి. ఇందులో మోనాల్ చుట్టూ తిరిగిన స్టోరీలు అందరినీ ఆకట్టుకున్నాయి. మోనాల్, అభిజిత్, అఖిల్ ట్రాక్ ఎంతటి వివాదానికి దారి తీసిందో తెలిసిందే.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో మోనాల్ ఎక్కువగా అఖిల్, అభిజిత్ లతోనే సమయం గడిపేది. కానీ కొన్నాళ్ళకు అభిజిత్ కి, మోనాల్ కి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మోనాల్.. అఖిల్ కి మరింత క్లోజ్ అయింది. ఆమె ఎలిమినేట్ అయి బయటకు వచ్చినప్పుడు కూడా అఖిల్ కి మద్దతు తెలిపింది. కానీ అతడు రన్నరప్ గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో అఖిల్-మోనాల్ లకు మంచి క్రేజ్ ఏర్పడింది.

అప్పుడప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిపై పోస్ట్ పై మరొకరు కామెంట్స్ పెట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా అఖిల్ ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన షర్ట్ బటన్ పెట్టుకోకపోవడంతో మోనాల్ సెటైర్ వేసింది. "షర్ట్ బటన్ పెట్టుకో" అంటూ లైవ్ లో చెప్పింది. తాజాగా అఖిల్ మరో పోస్ట్ పెట్టాడు. అందులో తన బెడ్ రూమ్ లో పడుకొని ఉన్నాడు. షర్ట్ లేకుండా ఉన్న ఫోటోని షేర్ చేస్తూ లాక్ డౌన్ లో తన రోజులు ఇలా గడిచిపోతున్నాయని చెప్పాడు.

దానికి మోనాల్.. ''బటన్ పెట్టుకోమని చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు షర్ట్ లేదు.. అమ్మో'' అంటూ కామెంట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.