Read more!

English | Telugu

అది నా చాన‌ల్ కాదు.. నా పేరుతో మోసం చేస్తున్నారు!

 

సినిమాల్లో హీరోయిన్‌గా రాని పేరును 'బిగ్ బాస్‌'లో కంటెస్టెంట్‌గా పాల్గొన‌డం ద్వారా సాధించింది మోనాల్ గ‌జ్జ‌ర్‌. దాంతో ఆమెకు ఐట‌మ్ సాంగ్స్ అవ‌కాశాల‌తో పాటు టీవీ షోల‌లో జ‌డ్జిగా, గెస్ట్‌గా పాల్గొనే అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయి. దీంతో ఆమె పేరును వాడుకుంటూ కొంత‌మంది మోసాల‌కు తెర‌తీశారు.

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన 'సుడిగాడు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఒకట్రెండు అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. కానీ అవి సక్సెస్ కాకపోవడంతో మోనాల్ టాలీవుడ్ కు దూరం కావాల్సి వచ్చింది. అయితే బిగ్ బాస్ షో తరువాత మోనాల్ బిజీ అయింది. 'అల్లుడు అదుర్స్' సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. 

సోషల్ మీడియాలో కూడా ఆమెకి పాపులారిటీ పెరిగింది. కాగా మోనాల్ పేరును వాడుకుంటూ కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుతో 'మోనాల్ గజ్జర్ అఫీషియల్' అనే ఫేక్ యూట్యూబ్ ఛానెల్ ను క్రియేట్ చేశారు. అందులో మోనాల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తున్నారు. 

దీంతో ఇది మోనాల్ సొంత యూట్యూబ్ ఛానెల్ అని ఫ్యాన్స్ భావించారు. ఈ విషయం మోనాల్ దృష్టికి రావడంతో ఆమె స్పందించింది. సదరు ఛానెల్ తనకు సంబంధించినది కాదని తేల్చి చెప్పింది. ఆ ఛానెల్ ఫేక్ అని.. ఫ్యాన్స్ ను అలర్ట్ చేసింది. ఆ ఫేక్ యూట్యూబ్ ఛానెల్ గురించి రిపోర్ట్ చేయమని అభిమానులను కోరింది.