English | Telugu

బిగ్ బాస్ సీజన్ 5 లేటెస్ట్ అప్డేట్!

బిగ్ బాస్ షోకి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. నిజానికి మే నెలలో ఈ షోను మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకే షోని చాలా ఆలస్యంగా మొదలుపెట్టారు.

ఇక ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో బిగ్ బాస్ షోను జూలైలో ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా సెలబ్రిటీల లిస్ట్ కూడా రెడీ చేశారట. ఇప్పుడు వాళ్లకు జూమ్ వీడియో కాల్స్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారని సమాచారం. రోజుకి ముగ్గురు చొప్పున 'మా' యాజమాన్యం కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూలు చేస్తుందట.

మరో వారం రోజుల్లో ఫైనల్ లిస్ట్ ను రెడీ చేసే అవకాశం ఉంది. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వడానికి ముందుకు కంటెస్టెంట్ లందరినీ హోమ్ క్వారెంటైన్ కు పంపించాల్సి ఉంటుంది. కాబట్టి రెండు వారాల ముందుగానే ఈ ప్రాసెస్ ను మొదలుపెట్టాలి. ఈసారి ప్రైజ్ మనీను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మూడు, నాలుగు సీజ‌న్ల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ఐదో సీజ‌న్‌కు కూడా హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.