English | Telugu

వర్షిణితో లిప్ లాక్.. రవితో ఆడుకున్న ముక్కు అవినాష్‌!

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై మేల్ అండ్ ఫీమేల్ యాంకర్స్ చేస్తోన్న రచ్చ మాములుగా లేదు. పలు షోలలో కనిపిస్తూ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు. స్టార్ మాలో ప్రసారమవుతోన్న 'కామెడీ స్టార్స్' షోకి మంచి టీఆర్పీలు వస్తుండడంతో షోకి మరింత రొమాన్స్ యాడ్ చేసి అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వర్షిణికి యాంకర్ రవి లిప్ లాక్ ఇస్తోన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

తాజాగా విడుదల చేసిన 'కామెడీ స్టార్స్' ప్రోమోలో ఈ లిప్ కిస్ కనిపించింది. ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ షోతో మంచి ఎంటర్టైన్మెంట్ పండిస్తున్నారు. వర్షిణి ఈ షోలో యాంకర్ గా చేస్తోంది. అలానే రవి.. లాస్యతో కలిసి సందడి చేస్తున్నాడు. వీరితో పాటు చమ్మక్ చంద్ర, అవినాష్, హరి లాంటి బుల్లితెర కమెడియన్స్ ఫన్ పంచుతున్నారు.

ఈ క్రమంలో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లో ముక్కు అవినాష్ స్కిట్ కోసం యాంకర్ రవిని హీరోగా, వర్షిణిని హీరోయిన్ గా మార్చేశారు. డైరెక్టర్ గా కనిపించిన అవినాష్.. హీరోయిన్ వర్షిణితో మీకు లిప్ లాక్ సీన్ ఉంటుందని చెప్పడంతో రవి సంబర పడిపోయాడు. ముందుగా వర్షిణిని హగ్ చేసుకొని రొమాంటిక్ గా చూడమని చెబుతాడు అవినాష్. అయితే రవి పెర్ఫార్మన్స్ అవినాష్ కి నచ్చకపోవడంతో ఎలా చేయాలో తనే స్వయంగా చేసి చూపిస్తాడు. షాట్ ఓకే అంటూ రవిని ఫూల్ చేస్తాడు. ఈ ప్రోమో నెట్టింట తెగ సంద‌డి చేస్తోంది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.