English | Telugu

చిన్న‌త‌నంలో హేమ రౌడీనా?

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవ‌ల వ‌రుస‌గా వార్త‌ల్లో నిలుస్తున్నారు. గ‌తంలో `మా` ఎల‌క్ష‌న్‌ల‌లో మెంబ‌ర్‌గా గెలిచి ప్ర‌మాణ స్వీకారం రోజు త‌న‌ని మాట్లాడ‌నివ్వ‌ని `మా` అధ్య‌క్షుడు న‌రేష్‌నే మీడియా సాక్షిగా క‌డిగిపారేసి వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌మాణ స్వీకారానికి ముందే మ‌మ్మ‌ల్ని మాట్లాడ‌నివ్వ‌కుండా మైక్ లాగేసుకుంటున్నారంటూ బాహాటంగానే న‌రేష్‌ని నిల‌దీసినంత ప‌ని చేశారు. ఇదిలా వుంటే ఆమెని న‌టుడు ఆలీ "చిన్న‌త‌నంలో రౌడీ అంట‌గా!" అంటూ సంబోధించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ టీవీలో ఆలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న`ఆలీతో స‌రదాగా` కార్య‌క్ర‌మంలో హేమ‌, న‌టి శ్రీ‌ల‌క్ష్మిఅతిథులుగా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా హేమ‌, శ్రీ‌ల‌క్ష్మీ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని ఆలీతో పంచుకున్నారు. ఈ క్ర‌మంలో"చిన్న‌త‌నంలో హేమ పెద్ద రౌడీ అంట‌ క‌దా?" అని ప్రశ్నించారు. దీనికి హేమ ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు.

"అలా ఏమీ కాదు కానీ ఇంట్లో అంద‌రికంటే నేను చిన్న‌దాన్ని.. అక్క‌ల‌తో క‌లిసి జాత‌ర‌ల‌కు, అంర్వేది తీర్థాల‌కు వెళుతుండేదాన్ని. అక్క‌డికి ఎంతో మంది జ‌నం వ‌చ్చేవారు. ఎవ‌రైనా మాతో వెకిలి వేషాలు వేస్తే అక్క‌డే కొట్టేసేదాన్ని. అలా ఒక‌బ్బాయిని కొడితే త‌ల బొప్పిక‌ట్టింది. అప్ప‌ట్లో నా చేతికి ఇనుప‌గాజులు వుండేవి. నేను ప్ర‌తీసారి గాజులు ప‌గ‌ల‌గొట్టుకుంటున్నాన‌ని అమ్మే ఇన‌ప‌గాజులు వేసేది"అని హేమ చిన్ననాటి సంగ‌తుల్ని పంచుకున్నారు.

hema shares her personal life, hema in Alitho Saradaga,Alitho Saradaga,Sri Lakshmi,Hema

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.