English | Telugu

ఈల వేసి రచ్చ చేస్తున్న ర‌ష్మీ గౌత‌మ్


బుల్లితెర యాంక‌ర్స్ సందు దొరికితే చాలు అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌తో టాపు లేపేస్తున్నారు. త‌మ టాలెంట్‌ని పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించే స్టేజీ ల‌భిస్తే చాలు ఓ రేంజ్‌లో అద‌రిగొట్టేస్తున్నారు. స‌రిగ్గా బుల్లితెర అందాల బొమ్మ ర‌ష్మీ గౌత‌మ్ అదే ప‌ని చేసింది. త‌న డ్యాన్స్ టాలెంట్‌ని బ‌య‌ట‌పెట్టే అవ‌కాశం రాగానే పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసేసుకుంది.

ఈల వేసి గోల చేసింది. అదిరిపోయే స్టెప్పుల‌తో ఓ రేంజ్‌లో అల్లాడించింది. `నా అందాల చూసీ కుర్రాళ్లు టెమ్ట్ అయితే నా త‌ప్పు ఏమున్న‌దబ్బా అంటూ క‌న్ను గీటి అదిరిపోయే మాస్ స్టెప్పుల‌తో ర‌చ్చ చేసింది. గులాబీ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌ష్మీ గౌత‌మ్ చేసిన ర‌చ్చ నెట్టింట, యూట్యూబ్‌లో సంద‌డి చేస్తోంది. `స్టార్ మా`లో 6 రియ‌ల్ క‌పుల్స్‌, 6 రీల్ క‌పుల్స్‌లో `100% ల‌వ్‌` పేరుతో ఓ ఎంట‌ర్‌టైనింగ్ షోని ప్రారంభించ‌బోతున్నారు.

ఈ నెల 21న ప్రారంభిం కానున్న ఈ షోకు యాంక‌ర్ ర‌వి, వ‌ర్షిణి సౌంద‌ర‌రాజ‌న్ వ్యాఖ్య‌త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ షోలో `నా త‌ప్పు ఏమున్న‌ద‌బ్బా..` అనే పెప్పీ మాస్ ఐట‌మ్ నంబ‌ర్‌కు ర‌ష్మీ గౌత‌మ్ వీర లెవెల్లో ప‌క్కా మాస్ పెర్ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టేసింది. దీనికి సంబంధించిన ప్రోమో స్టార్ మా అఫీష‌య‌ల్ ట్విట్ట‌ర్ పేజీలో సంద‌డి చేస్తోంది. ర‌ష్మీ గౌత‌మ్ అభిమానుల‌కు ఈ సాంగ్ ఓ పండ‌గే.. అంత‌లా ర‌ష్మీ ఈ పాట‌లో అందాలు ఆర‌బోసి ఊర మాస్ స్టెప్పుల‌తో విజిల్స్ వేస్తూ ర‌చ్చ చేసింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.