English | Telugu

గెటప్ శ్రీను భార్యపై హ్యాకింగ్ ఎఫెక్ట్‌!

'జబర్దస్త్' కామెడీ షోతో చాలా మందికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. బుల్లితెర నుండి ఏకంగా వెండితెరపై అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఈ లిస్టులో గెటప్ శ్రీను ముందంజలో ఉంటారు. ఈ కమెడియన్ చాలా ఇంటర్వ్యూలలో తన భార్య సుజాత గురించి చెప్పుకొచ్చారు. తమ ప్రేమ, పెళ్లి విషయాల గురించి పలు సందర్భాల్లో మాట్లాడారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబ్ ఛానెల్స్ పెడుతూ వెరైటీ వీడియోలను పోస్ట్ చేస్తూ మెప్పిస్తున్నారు.

గెటప్ శ్రీను భార్య కూడా సుజిశ్రీన్ కలెక్షన్స్ అంటూ మహిళలు, అమ్మాయిలకు అవసరమైన వస్తువులను సోషల్ మీడియా ద్వారా అమ్ముతున్నారు. అయితే తన పాత అకౌంట్ హ్యాక్ కావడంతో కొత్త ఖాతాను మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. పాత అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి, ఎడిట్ చేయడంతో మరో ఆప్షన్ లేక కొత్త అకౌంట్ ను ఓపెన్ చేశానని చెప్పారు.

ఈ వీడియోను గెటప్ శ్రీను తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేస్తూ తన భార్యకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో 'జబర్దస్త్' షోలో కొందరు కమెడియన్స్ సుజాతకు మద్దతుగా వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ హ్యాకింగ్ కారణంగా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బంది పడ్డారు. రీసెంట్ గా 'జబర్దస్త్' రామ్ ప్రసాద్ విషయంలో కూడా ఇదే జరిగింది. పలు సార్లు తన అకౌంట్లు హ్యాక్ అవుతుండడంతో రామ్ ప్రసాద్ విసిగిపోయారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.