English | Telugu

నిత్య‌కు యాంకర్ రవి ఎంత యూనిక్‌గా ప్ర‌పోజ్ చేశాడో తెలుసా?

యాంకర్ రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. తన భార్య, కూతురితో కలిసి రవి చేసే అల్లరి మాములుగా ఉండదు. ముఖ్యంగా రవి కూతురు వియా ముద్దుముద్దు మాటలకు అందరూ మురిసిపోతుంటారు. ఈ మధ్యకాలంలో రవి తన యూట్యూబ్ ఛానెల్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాడు. సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

తన ఫ్యామిలీతో స్పెషల్ వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాడు. తాజాగా వియాతో ఓ స్పెషల్ వీడియోను చేశారు. వియా తన అమ్మా, నాన్నలను ఇంటర్వ్యూ చేస్తుంది. అలా వియా అడిగిన ప్రశ్నలకు రవి, నిత్య ఇద్దరూ సమాధానాలు చెప్పారు. ఇందులో రవి తనకు ఎలా ప్రపోజ్ చేశాడనే విషయాన్ని నిత్య చెప్పింది.

రవి తనకొక పెద్ద తొట్టిని గిఫ్ట్ గా ఇచ్చాడంట‌.. అందులో అంతా మట్టి ఉందని.. వారం రోజులు నీళ్లు పోస్తూ ఉండమని రవి చెప్పాడట. నిత్య అలానే చేస్తూ ఉండగా.. వారం రోజుల తరువాత అసలు విషయం తెలిసిందని నిత్య తెలిపింది. 'ఐ లవ్ యూ' అనే అక్షరాల రూపంలో ఆ మొక్కలు మొలకెత్తాయని.. ఆ విధంగా రవి తనకు ప్రపోజ్ చేశాడని నిత్య తన ఫ్లాష్‌బ్యాక్ ను గుర్తు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రవి యూనిక్ ఐడియాను తెగ పొగిడేస్తున్నారు.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.