English | Telugu

ఫ‌స్ట్ టైమ్ లైవ్‌లో వంటలక్క క‌న్నీరుమున్నీరు!

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సినీ పరిశ్రమకు కూడా కష్టాలు ఏర్పడ్డాయి. దాదాపు షూటింగులన్నింటికీ బ్రేక్ పడింది. కానీ కొందరు మాత్రం ఇండోర్‌ షూటింగ్ లను అతి తక్కువ మంది స్టాఫ్‌తో కానిచ్చేస్తున్నారు. అందులో 'కార్తీకదీపం' సీరియల్ కూడా ఉంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. తక్కువమందితో ఈ సీరియల్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీరియల్ లో నటించేవారందరూ కూడా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ముఖ్యంగా వంటలక్క పాత్రలో నటిస్తోన్న ప్రేమి విశ్వనాథ్‌కు భారీ క్రేజ్ వచ్చింది. మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి ఎనలేని గుర్తింపు లభించింది. తాజాగా యాంకర్ సుమతో కలిసి ప్రేమి విశ్వనాథ్ లైవ్ లోకి వచ్చింది. తెనాలి డబుల్స్ హార్స్ అనుబంధం అంటూ ఈ ఇద్దరూ లైవ్ లో పాల్గొన్నారు. అందులో ప్రేమి విశ్వనాథ్ చాలా విషయాలను పంచుకుంది. షూటింగ్ ల కోసం ప్రతి వారం కేరళ, తెలంగాణ అంటూ తిరుగుతున్నానని చెప్పింది.

ప్రతి వారం కరోనా టెస్ట్ లు చేయించుకుంటున్నానని తెలిపింది. అయితే ఇలా కరోనా సమయంలో బయటకు రావడం మాత్రం తన తండ్రికి అసలు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. తన గురించి ఆయన ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారని.. క్షేమంగా ఇంటికి వచ్చేవరకు టెన్షన్ పడుతూనే ఉంటారని చెప్పింది. ఇంటికి వెళ్లి స్నానం చేసి ఆయన ముందు కూర్చున్నప్పుడే టెన్షన్ పోతుందని.. తన తండ్రి గురించి చెబుతూ లైవ్‌లోనే ప్రేమి విశ్వనాథ్ కంటతడి పెట్టుకుంది. సీరియల్ లో తప్ప బయట ఎక్కడా ఏడవలేదని.. ఇదే మొదటిసారి అని చెబుతూ ఎమోషనల్ అయింది.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.