English | Telugu

తల్లయిన సుధీర్.. "పాపా, బాబా?" అనడిగిన రష్మి!

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో 'ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌'. ఈ షోకి రోజా, మ‌నో న్యాయ నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ర‌ష్మీ గౌత‌మ్ యాంక‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ షోలో సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను, రామ్ ప్ర‌సాద్ చేసిన కామెడీ టాప్ లేపుతోంది. స్కిట్‌లో భాగంగా సుడిగాలి సుధీర్‌కి ర‌ష్మీ గౌత‌మ్ ముందే రామ్‌ప్ర‌సాద్, గెట‌ప్ శ్రీ‌ను శ్రీ‌మంతం చేసేశారు.

ర‌ష్మీ గౌత‌మ్‌కు, సుడిగాలి సుధీర్‌కు మ‌ధ్య ఏదో జ‌రుగుతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఆమె ముందే స్కిట్లో సుడిగాలి సుధీర్‌కు శ్రీ‌మంతం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది. రామ్‌ప్ర‌సాద్ బొట్టు, కాళ్ల‌కు పారాణి పెట్టి శ్రీ‌మంతం చేయ‌డంతో లోప‌లికి వెళ్లిన సుధీర్ చేతుల్లో ఓ పాపాయి బొమ్మ‌ని వెంట తీసుకుని వ‌స్తూ ప్రెగ్నెంట్ లేడీగా నైటీలో క‌నిపించ‌డంతో రోజాతో పాటు ర‌ష్మి ఆ దృశ్యాన్ని చూసి పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వారు.

బిడ్డ‌ని చేతుల్తో సుడిగాలి సుధీర్ ప‌ట్టుకుని వ‌స్తుండ‌గా "వ‌ట ప‌త్ర శాయికి.." అంటూ బ్యాగ్రౌండ్‌ సాంగ్ వేశారు.. ఇంత‌లో రోజా క‌ల్పించుకుని "చూడ్డానికి రెండు క‌ళ్లు చాల‌ట్లేదు" అన్నారు. ఆ వెంట‌నే "నువ్వు అబ్బాయివి.. అలాంటిది నీకు గ‌ర్భం కావ‌డం, మేము నీకు సీ‌మంతం చేయ‌డం.. నీకు బాబు పుట్ట‌డం ఏంటీ?" అనేశాడు రామ్ ప్ర‌సాద్‌.

ఇంత‌లో ర‌ష్మీ క‌ల‌గ‌జేసుకుని "ఇంత‌కీ బాబా, పాపా?" అని అడిగితే రామ్ ప్ర‌సాద్ "ఉండ‌వ‌మ్మా ఈ బిడ్డ‌కి తండ్రెవ‌రో తెలియ‌డం లేదు." అన‌డంతో సుడిగాలి సుధీర్ ఫ్యూజులు ఔట్ అయ్యాయి. వ‌చ్చే శ‌నివారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.