English | Telugu

పోలీసుల కౌన్సిలింగ్‌కి డుమ్మా కొట్టిన యూట్యూబ్ స్టార్‌‌?

యూట్యూబ్ స్టార్ ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ త‌న విభిన్న‌మైన వీడియోల‌తో పాపుల‌ర్ అయ్యారు. త్వ‌ర‌లో బిగ్ ‌బాస్ సీజ‌న్ 5 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న జ‌స్వంత్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికి పోయి పోలీసుల‌కు చిక్క‌డం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం తెలిసిందే. ఆ త‌రువాత అత‌నికి బెయిల్ మంజూరు చేసిన పోలీసులు కౌన్సిలింగ్ కోసం హాజ‌రు కావాల‌ని సూచించార‌ట‌.

తాజాగా అత‌న్ని పోలీసులు కౌన్సిలింగ్‌కి పిలిచారు. అయితే వారి ఆదేశాల‌ని ష‌ణ్ముఖ్‌ జ‌స్వంత్ బేఖాత‌రు చేశార‌ట‌. కౌన్సిలింగ్‌కి డుమ్మా కొట్టాడ‌ని చెబుతున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ పోలీసులు అత‌నిపై ప్రొసీడింగ్‌కు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. గ‌త కొన్ని రోజుల క్రితం ష‌ణ్ముఖ్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం. 10లో కారుతో రెండు కార్ల‌ని, ఓ బైక‌ర్‌ని ఢీ కొట్టాడు. అత‌ను తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు.

ఆ స‌మ‌యంలో అత‌ను మ‌ద్యం సేవించి వుండ‌టంతో బ్రీత్ ఎన‌లైజ‌ర్‌తో టెస్ట్ చేశారు. మ‌ద్యం సేవించిన‌ట్టు నిర్ధార‌ణ కావ‌డంతో అత‌నిపై సెక్ష‌న్ 337, 279 కింద కేసు న‌మోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌రువాత బెయిల్‌పై విడుద‌ల చేశారు. తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ బిగ్ ‌బాస్ సీజ‌న్ 5 ఎంట్రీ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.